తగ్గుతున్న క్రూడ్ ధర; పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గే అవకాశం!

మోటారిస్టులకు నవంబర్ నెల ఊరట కలిగించదనే చెప్పాలి. గత కొంత కాలంగా కొండెక్కి కూర్చున్న పెట్రోల్, డీజిల్ ధరను ఈనెల ఆరంభంలో లీటరుకు రూ.2 లకు పైగా తగ్గిన సంగతి తెలిసినదే. అయితే, మరో గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ధరలు మరోసారి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధరలు సోమ, మంగళ వారాల్లో భారీగా దిగొచ్చాయి. అమెరికాకు ఎగుమతి చేసే క్రూడ్ ధరను సౌదీ అరేబియా తగ్గించడంతో రేట్లు పడిపోయాయి.

న్యూయార్క్ కమోడిటీ ఎక్స్‌చేంజ్ (నెమైక్స్)లో ట్రేడ్ అయ్యే లైట్ స్వీట్ క్రూడ్ బ్యారెల్ ధర మంగళవారం 2.5 డాలర్లమేర తగ్గి, 76 డాలర్లకు పడిపోయింది. గడచిన 2011 అక్టోబర్ నెల తర్వాత ఇది ఈ స్థాయికి తగ్గటం ఇదే ప్రప్రథమం. అలాగే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు కూడా నాలుగున్నరేళ్లకు పైగా కనిష్టానికి తగ్గింది. ఇది 2 డాలర్లకుపైగా తగ్గి 82 డాలర్లకు పడిపోయింది. గడచిన రెండు రోజుల్లో ఈ రెండు రకాల క్రూడ్ ఆయిల్ ధరలు 4 శాతానికి పైగా తగ్గాయి.

Petrol And Diesel Prices Likely To Be Cut Again

ఈనెల 15వ తేదీ వరకూ ఇదే ట్రెండ్ కొనసాగినట్లయితే, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగానే భారత మార్కెట్లో కూడా ఇంధన ధరలు మరింత దిగొచ్చే అవకాశం ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్ (ఎమ్‌సిఎక్స్)లో మంగళవారం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 5 శాతానికి పైగా క్షీణించింది.

కాగా.. గడచిన అక్టోబర్ 31,2014 తేదీన ఇండియన్ క్రూడ్ బాస్కెట్ బ్యారెల్ ధర 83.80 డాలర్లకు పడిపోవటంతో, భారత మార్కెట్లో చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు పెట్రోలుపై 2.41 రూపాయల చొప్పున, లీటరు డీజిల్ పై 2.25 రూపాయల చొప్పున తగ్గింపు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఇప్పటి వరకు గత రెండు నెలల్లో ఆరు సార్లు పెట్రోల్ ధరలు తగ్గగా, డీజిల్ ధరలు రెండు సార్లు తగ్గాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, November 5, 2014, 10:05 [IST]
English summary
Petrol and Diesel prices likely to be slashed again as Brent crude oil on Tuesday fell to its lowest in four years at $80 a barrel after Saudi Arabia cut sale prices to the US. Stay tuned for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+