ఇంధన ప్రమాణాలను పెంచేందుకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
వినియోగదారులారా.. మరో పెట్రో ఘాతాన్ని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండండి. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరల పెంపుతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నిపుణుల కమిటి సిఫారసుల మేరకు లీటర్ పెట్రోల్‌పై 75 పైసలు పెంచే అవకాశముంది.
వచ్చే 2020 నాటికి క్యాన్సర్ కారక కాలుష్యాలను తొలగించేందుకు జాతీయ ఇంధన ప్రమాణాలను అప్‌గ్రేడ్ చేసేందుకు గాను నిపుణుల కమిటీ ఇచ్చిన నివేధిక ఆధారంగా చేసుకొని కూడా ఇంధన ధరలను పెంచనున్నారు. పెట్రోల్, డీజిల్ లకు సమాంతరంగా యూరో-వీ రిఫైనరీల అప్ గ్రేడ్ కోసం రూ.80,000 కోట్ల పెట్టుబడులు అవసరం ఉందని సుమిత్రా చౌదరీ కమిటీ సూచనలు చేసింది.

ఈ పెట్టుబడులను రాబట్టాలంటే పెట్రోల్, డిజీల్ ధరలపై 75 పైసల పెంపు చేయాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. ఈ ప్యానెల్‌కు సారథ్యం వహిస్తున్న ప్రణాళికా సంఘం సభ్యులు చతుర్వేది సూచనల ప్రకారం,2017 నాటికి దేశవ్యాప్తంగా విక్రయించబడే ఇంధనాలు యూరో-4 నిబంధనలను, అలాగే 2020 నాటికి యూరో-5 నిబంధనలు పాటించాలి.
బిఎస్ 6 కాలుష్య నిబంధనలు ఏప్రిల్ 2024 నుంచి అమల్లోకి రావచ్చని అంచాన. ప్రస్తుతం 26 నగరాలు (ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, లక్నో వంటి నగరాలు) యూరో-4 (దీనిని బిఎస్-4 అని కూడా అంటారు)కు సమానమైన ఇంధనాలను ఉపయోగిస్తుంటే, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో బిఎస్-3 ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








