పెట్రోల్ ధరలను స్వల్పంగా తగ్గించిన ఆయిల్ కంపెనీలు
పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. డాలరు మారకంతో పోల్చుకుంటే, రూపాయి మారకపు విలువ తగ్గడంతో, ప్రభుత్వ రంగ చమురు కంపెనీ పెట్రోల్ ధరను లీటరుకు 75 పైసల చొప్పున (స్థానిక పన్నులు లేదా వ్యాట్ కలుపుకోకుండా) తగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
తగ్గిన పెట్రోల్ ధరలు సోమవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. పెట్రోలు ధర ప్రతి రాష్ట్రంలో వేర్వేరుగా ఉంటుంది. పెట్రోల్ ధరను చివరిగా ఫిబ్రవరి 28వ తేదీన సవరించారు. ఆ సమయంలో లీటరు పెట్రోల్‌పై 60 పైసలు మరియు లీటరు డీజిల్‌పై 50 పైసల చొప్పున పెంచారు.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పెట్రోల్ ధరలను మూడుసార్లు సవరించారు. కేంద్రంపై పెట్రోల ధరలపై నియంత్రణలు పూర్తిగా ఎత్తివేసినప్పటి నుంచి వాటి నియంత్రణ చమురు కంపెనీల హస్తగతమైన సంగతి తెలిసినదే. కాగా.. డీజెల్ ధరలపై కూడా ప్రభుత్వం త్వరలోనే నియంత్రణలను ఎత్తివేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ దిశలో భాగంగానే, ప్రతినెలా డీజిల్ ధరను పెంచడం జరుగుతోంది.
ధర తగ్గింపు అనంతరం దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
* ఢిల్లీ - రూ.72.26
* కోల్‌కతా - రూ.80.13
* ముంబై - రూ.80.89
* చెన్నై - రూ.75.49


Click it and Unblock the Notifications








