లీటరుకు 91 పైసలు తగ్గిన పెట్రోల్ ధర, డీజిల్‌పై 84 పైసల తగ్గింపు
మోటారిస్టులకు గుడ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి స్వల్పంగా తగ్గముఖం పట్టాయి. ఈసారి లీటరు పెట్రోలుపై 91 పైసలు, లీటరు డీజిలుపై 84 పైసల చొప్పున ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు మరింత తగ్గిన నేపథ్యంలో, ఆదివారం నాడు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ తగ్గింపును ప్రకటించాయి.
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. కాగా.. గడచిన ఐదు నెలల్లో పెట్రోల్ ధరలు తగ్గడం 8వసారి కాగా డీజిల్ ధర తగ్గడం 4వసారి. నవంబరు మొదటి వారంలో లీటరు పెట్రోల్ ధరపై 2.41 పైసలు మరియు లీటరు డీజిల్ ధరపై 2.25 పైసల చొప్పను తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసినదే.
తాజా తగ్గింపు తర్వాత, ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.64.25 పైసలు ఉంది. గత ఆగస్టు నెల నుండి ఇప్పటి వరకు పెట్రోలు ధరలో మొత్తమ్మీద లీటరుకు రూ.10.27 పైసలు వరకూ తగ్గుతూ వచ్చింది.



Click it and Unblock the Notifications








