రూ.2 లకు పైగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర

ఊహించినట్లుగానే పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి లీటరుకు రూ.2లకు పైగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు మరింత తగ్గిన నేపథ్యంలో, శుక్రవారం నాడు చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు పెట్రోలుపై 2.41 రూపాయల చొప్పున, లీటరు డీజిలై 2.25 రూపాయల చొప్పున తగ్గింపు ప్రకటించాయి.

గత రెండు నెలల్లో ఆరు సార్లు పెట్రో ధరలు తగ్గగా, డీజిల్ ధరలు రెండు సార్లు తగ్గాయి. తాజాగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. గడచిన ఆగస్టు ఒకటో తేదీ నాటికి లీటరు పెట్రోలు ధర రూ.79.01లుగా ఉండగా, తాజా తగ్గింపుతో అది రూ.72 లకు చేరుకుంది.

Petrol Price Cut

అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ ముడిచమురు ధర దాదాపు 85 డాలర్లకు పడిపోయింది. గడచిన అక్టోబర్ 2014 నెలలో రెండు సందర్భాలలో పెట్రోల్ ధరను దాదాపు రూ.2 వరకూ తగ్గించిన సంగతి తెలిసినదే. ఇదే నెలలో డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణలు ఎత్తివేయటంతో డీజిల్ ధరలో లీటరుకు రూ.3.37 వరకూ తగ్గింది. జనవరి 29, 2009లో డీజిల్ ధరను లీటరుపై రూ.2 చొప్పున తగ్గించన తర్వాత, సుమారు ఐదేళ్ల అనంతరం డీజిల్ ధరను తగ్గించడం ఇదే మొదటిసారి.

జనవరి 29, 2009 నాటికి లీటరుకు 30.86గా ఉన్న డీజిల్ ధర ఏకంగా లీటరుకు రూ.58.97 లకు పెరిగింది. డీజిల్ డీరెగ్యులేషన్ తర్వాత విధించిన తగ్గింపు కారణంగా ప్రస్తుతం ఢిల్లీలో లీటరు డీజిల్ ధర లీటరుకు రూ.55.6లుగా ఉంది. అలాగే, ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.66.65లుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, November 3, 2014, 11:04 [IST]
English summary
Petrol price was today cut by Rs 2.41 a litre, the sixth reduction since August, and diesel by Rs 2.25 per litre on back of falling international oil rates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+