తగ్గిన పెట్రోల్ ధర, పెరిగిన డీజిల్ ధర

By Ravi

పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గటం, రూపాయి మారకపు విలువ పెరగటంతో పెట్రోల్‌ ధరను లీటరుకు రూ.1.09 పైసల మేర తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి.

కాగా.. డీజిల్ ధర మాత్రం ఎప్పటి మాదిరిగానే లీటరు 50 పైసల చొప్పున పెరిగింది (స్థానిక పన్నులు కలుపుకోకుండా). తగ్గిన పెట్రోల్ ధరలు మరియు పెరిగిన డీజిల్ ధరలు గురువారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు చమరు కంపెనీలు తెలిపాయి.

తాజా తగ్గింపు తర్వాత ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.72.51గా ఉంటే, ముంబైలో రూ.80.60, కోల్‌కతాలో రూ.80.30, చెన్నైలో రూ.75.78లుగా ఉన్నాయి. అలాగే పెరిగిన డీజిల్ ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ రూ.58.40లు కాగా, ముంబైలో రూ.66.63, కోల్‌కతాలో రూ.63.22, చెన్నై రూ.62.30లుగా ఉన్నాయి.

ప్రతినెలా డీజిల్ ధరను లీటర్‌కు 50 పైసలు చొప్పును పెంచుతూ వస్తున్నప్పటికీ, తాము ఇంకా లీటరు డీజిల్ విక్రయంపై రూ.1.33 పైసలు నష్టపోతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.

Petrol Price Cut

More from DriveSpark

Article Published On: Friday, August 1, 2014, 9:06 [IST]
English summary
Petrol price was cut by Rs 1.09 per litre, the second reduction in three-and-half-months, while diesel rates were hiked by 56 paise a litre.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+