క్వాడ్రిసైకిల్ విభాగంపై కన్నేసిన పియాజ్జియో!
భారత ఆటోమొబైల్ మార్కెట్లో 'క్వాడ్రిసైకిల్' (నాలుగు చక్రాలు కలిగిన కమర్షియల్ ప్యాసింజర్ వాహనం) అనే కొత్త వాహన విభాగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రకటించడంతో, ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు అనేక ఆటోమొబైల్ కంపెనీ తహతహలాడుతున్నాయి.
ఇప్పటికే బజాజ్ ఆటో తమ ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంటే, తాజాగా మరో కంపెనీ ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం పియాజ్జియో క్వాడ్రిసైకిల్ సెగ్మెంట్లో ఉత్పత్తులు విడుదల చేయాలని యోచిస్తోంది.
అయితే, పియాజ్జియో బజాజ్ మాదిరిగా ఆటోరిక్షాలను రీప్లేస్ చేస్తూ క్వాడ్రిసైకిళ్లను ప్రవేశపెట్టడం కాకుండా, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న త్రిచక్ర వాహనాల (ఆటోరిక్షాలు)ను యధావిధిగా కొనసాగిస్తూ, వాటితో పాటే ఈ క్వాడ్రిసైకిళ్లను కూడా ఆఫర్ చేస్తామని పియాజ్జియో వెహికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హర్దీప్ గోయింది తెలిపారు.

మార్కెట్లో పియాజ్జియో ఆపే సిటీ ఆటోరిక్షా విడుదల
నగర ప్రయాణానికి వీలుగా డీజిల్ విభాగంలో పియాజ్జియో తమ చిన్న ఆటో ‘ఆపె సిటీ' మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ఈ ఆటోరిక్షా ధర రూ.1.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది లీటరుకు 38 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.
చిన్న మెకానిక్‌లు సైతం రిపేర్ చేయగలిగేలా దీని ఇంజన్‌ను తీర్చిదిద్దామని, దీని నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటమే కాకుండా, ఈ ఆటోరిక్షా విడిభాగాలు కూడా ఎక్కడైనా దొరుకుతాయని పియాజ్జియో పేర్కొంది. ఎవరైనా దీనిని సులువుగా నడిపేందుకు వీలుగా ఉండేలా హ్యాండిల్‌కే క్లచ్‌ను ఏర్పాటు చేశామని, ఇతర ఆటోల కంటే ఇందులో ఎక్కువ లేగేజ్ పడుతుందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








