జమ్మూ కాశ్మీర్‌లో రెస్క్యూ ఆపరేషన్ పోలారిస్ వాహనాలు

By Ravi

ఆఫ్-రోడ్, ఆల్-టెర్రైన్ వాహనాల తయారీలో ప్రపంచ అగ్రగామి అయిన పోలారిస్ ఇండస్ట్రీస్‌కు చెందిన పూర్తి భారతీయ అనుబంధ సంస్థ పోలారిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జమ్మూ అండ్ కాశ్మీర్‌లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అక్కడి ప్రాంతానికి అనువుగా ఉండేలా నాలుగు డెమో ఆఫ్-రోడ్ వాహనాలను కంపెనీ ఎన్‌డిఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్)కు అందజేసింది.

పోలారిస్ ఇండియా అందిస్తున్న రేంజర్ 6x6 800, రేంజర్ క్రూ 800, ఆర్‌జెడ్ఆర్ ఎక్స్‌పి 4 900, స్పోర్ట్స్‌మ్యాన్ ఎమ్‌వి 700 వాహనాలను న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఓ.పి. సింగ్ ఐపిఎస్ గారికి కంపెనీ అందజేసింది.

Polaris

ఈ ఆఫ్-రోడ్ వాహనాలతో పాటుగా పోలారిస్ ఓ అంబులెన్స్‌ను కూడా జమ్మూ అండ్ కాశ్మీర్‌కు పంపిస్తోంది. కంపెనీ విక్రయిస్తున్న రేంజర్ 6x6 వాహనాన్ని బఫ్నా హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అంబులెన్స్‌గా మోడిఫై చేసింది. ఈ వాహనాలన్నీ కూడా రోడ్లు సైతం లేని టెర్రైన్‌లపై ప్రయాణించేందుకు వీలుగా ఉంటాయి. వరదల్లో చిక్కుకుపోయిన వారికి, వరద బాధితులకు ఈ వాహనాల ద్వారా సేవలు అందించనున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, September 18, 2014, 10:18 [IST]
English summary
Polaris India Pvt. Ltd, a wholly owned subsidiary of Polaris Industries Inc., the world leader in off-road and All-Terrain vehicles has volunteered four demo Off-Road Vehicles (ORVs) to NDRF (National Disaster Response Force), to assist in relief efforts after the state was hit by floods recently. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+