ముందుగా చెప్పకుండా బస్ క్యాన్సిల్ చేస్తే, లైసెన్స్ క్యాన్సిల్!

By Ravi

కేరళలో ప్రైవేట్ బస్సుల ఆగడాలకు చెక్ వేసేందుకు అక్కడి ప్రభుత్వం ఓ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, బస్సులను క్యాన్సిల్ చేస్తే సదరు ట్రావెల్ ఏజెన్సీలు లైసెన్సును కోల్పోవాల్సి వస్తుందని కేరళలోని కోళికోడ్ జిల్లాకు చెందిన మోటార్ వాహన విభాగం హెచ్చరించింది.

ప్రయాణాలకు సిద్ధమయ్యే వారు, బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండే ప్రయాణీకుల నుంచి నిరంతరం వస్తున్న ఫిర్యాదులకు స్పందించిన మోటార్ వాహన విభాగం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అనేక సందర్భాల్లో ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బస్సులను రద్దు చేస్తుండటంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

Bus Rule

ముఖ్యంగా పెరుమన్న, పూవట్టుపరంబ, మెడికల్ కాలేజ్, మాన్కావు, మవారు, కోయిలాండి, వడకర వంటి ఇతర రూట్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఈ రూట్లలో మధ్యాహ్నం మరియు రాత్రివేళల్లో బస్సులు ఎక్కువగా అందుబాటులో ఉండవు.

ఇందుకు బస్ ఆపరేటర్లు చెబుతున్న కహానీలు ఏంటంటే.. వేసవి సెలవుల కారణంగా సిబ్బంది అందుబాటులో లేరని లేదా పైన తెలిపిన సమయాల్లో ప్రయాణీకులు తక్కువగా ఉంటారు కాబట్టి, ఆ సమయాల్లో బస్సులు నడిపితే డబ్బులు రావని చెబుతున్నారు.

అయితే, అధికారులు మాత్రం ఈ విషయాన్ని కొంచెం సీరియస్‌గానే తీసుకున్నారు. బస్సులను క్యాన్సిల్ చేసిన వారిపై మొదటి తప్పుగా రూ.5,000 జరిమానా విధించడం జరుగుతుందని, ఇదే తప్పుని పలుమా్ర్లు చేసినట్లయితే, ఆపరేటర్ లైసెన్స్ రద్దు చేయటం జరుగుతుందని ఆపరేటర్లకు అక్కడి అధికారులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి రూల్ అన్ని రాష్ట్రాల్లో అమలైతే బాగుంటింది కదా!

More from DriveSpark

Article Published On: Wednesday, April 23, 2014, 17:43 [IST]
English summary
The Motor Vehicles Department (MVD) in Kerala's Kozhikode district have started cracking down on private bus operators who have been cancelling buses on certain routes without prior notice.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+