మా టాక్సీలు సురక్షితమైనవి - రేడియో టాక్సీ అసోసియేషన్

By Ravi

ఢిల్లీ అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. హస్థిన నగరంలో అమ్మాయిలకు రక్షణ కరువవుతోంది. ఇటీవల దేశరాజధాని నడిబొడ్డున ఉబెర్ క్యాబ్ డ్రైవర్, ఓ పాతికేళ్ల మహిళపై అత్యాచారం జరిపిన ఘటన మరోసారి దేశాన్ని కదిపివేసింది. ఈ సంఘటన నేపథ్యంలో ఇప్పటికే, పలు లైసెన్స్ లేని క్యాబ్ సర్వీసులను భారత ప్రభుత్వం నిషేధించింది.

ఈ నిర్ణయంతో టాక్సీలను ఆపరేట్ చేసే వారు గుండెల్లో కార్లు పరుగులు తీస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉబెర్ సేవలను నిషేధించారు. హైదరాబాద్‌లో కూడా ఈ సర్వీసులను నిషేధించినట్లు సమాచారం. అంతేకాకుండా.. అప్లికేషన్ (యాప్) ఆధారిత క్యాబ్ సర్వీసులను మరియు లైసెన్స్ లేని క్యాబ్ సర్వీసులపై కూడా ప్రభుత్వం కొరడా జులుపించింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో తమ టాక్సీలు మాత్రం అత్యంత సురక్షితమైనవని, నమ్మదగినవని రేడియో టాక్సీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తమ సంఘంలో ఉన్న అన్ని రేడియో టాక్సీ ఆపరేటర్లు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆయా రాష్ట్ర రవాణా విభాగాలు నిర్దేశించిన మార్గదర్శకాలు, నియమాలను పాటిస్తాయని అసోసియేషన్ పేర్కొంది.

Our Taxis are Safe

రేడియో టాక్సీ ఆపరేటర్లు డ్రైవర్లను తనిఖీ చేసిన తర్వాతే నియమించుకుంటారని, అన్ని టాక్సీలకు జిపిఆర్ఎస్ ట్రాకింగ్ ఉంటుందని, వివిధ కస్టమర్ ప్రొఫైల్స్‌కు సేవలదించేందుకు వీలుగా డ్రైవర్లకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని రేడియో టాక్సీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, కోల్‌కటా, ఛండీఘడ్, పంజాబ్, ఇండోర్ మొదలైన నగరాల్లో రేడియో టాక్సీలను నిర్వహిస్తున్నారు.

మెగా క్యాబ్స్, ఈజీ క్యాబ్స్, మెరూ క్యాబ్స్, గీ క్యాబ్స్ (గుర్గావ్), ఛాన్సన్ క్యాబ్స్, యో క్యాబ్స్, స్కై క్యాబ్స్ (హైదరాబాద్), ఆర్‌బిటిఎస్ (ఛండీఘడ్), ఫ్యాబ్ క్యాబ్స్ (ఛండీఘడ్), స్టార్ క్యాబ్ (ఇండోర్)లు రేడియో టాక్సీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా ఉన్నారు.

Most Read Articles

English summary
Radio Taxi Association of India, that represents all licensed Radio Taxi operators across India confirmed that all the members of the association follow all the rules and guidelines issued by the State Transport Departments in all major cities.
Story first published: Thursday, December 11, 2014, 10:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X