ఇంద్రధనుస్సు రంగులో లాంబోర్గినీ గల్లార్డో!

By Ravi

ఏడు రంగుల ఇంద్రధనుస్సు అంటే ఇష్టపడని వారెవరూ ఉండరేమో. అలాగే ఇంద్రధనుస్సు రంగులో ఉండే వస్తువులంటే ఇష్టపడని వారుండరు. సాధారణంగా కార్లు, సింగిల్ లేదా డ్యూయెల్ కలర్ ఎక్స్టీరియర్ పెయింట్ జాబ్‌తో లభిస్తుంటాయి. కానీ ఏ కంపెనీ కూడా ఇంద్రధనుస్సు రంగులో ఉండే కార్లను ఆఫర్ చేయదు.

కానీ ఎవరికైనా ఇలాంటి కార్లు కావాలనిపిస్తే, వారు తమ కార్లను ప్రత్యేకంగా పెయింట్ చేయించుకోవాలి. ఇది చాలా ఖరీదుతో కూడుకున్న విషయం. అయితే, ఇప్పుడు వినైల్ వ్రాపింగ్ అనే టెక్నాలజీతో చాలా సరసమైన ధరకే మన కార్లన మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.


ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న లాంబోర్గినీ గల్లార్డో కారును చూడండి. ఇంద్రధనుస్సు అంటే ఇష్టమున్న ఓ లాంబోర్గినీ కార్ ఓనర్ తన కారును ఇలా వినైల్ వ్రాపింగ్‌తో ఏడు రంగుల కారుగా మార్చేసుకున్నాడు.

వినైల్ వ్రాపింగ్ ఇప్పుడు కొత్త ట్రెండ్‌‌గా మారిపోయింది. చాలా మంది కార్ ఓనర్లు ఖరీదైన పెయింట్ జాబ్‌కు గుడ్‌బై చెప్పి, వినైల్ వ్రాపింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. వినైల్ వ్రాపింగ్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఇదొక చిరిగిపోని స్టిక్కర్ లాంటింది.

Rainbow Lamborghini

కారుపై దీనిని అతికిస్తారు, అవసరం లేదనుకున్నప్పుడు ఈ వ్రాప్‌ను జాగ్రత్తగా తొలగించుకుంటే, మన కార్ కలర్ యధావిధిగా అలానే ఉంటుంది. ప్రస్తుతం అనేక కార్ డెకార్ కంపెనీలు ఈ వినైల్ వ్రాపింగ్‌ను చేస్తున్నాయి. వినైల్ వ్రాపింగ్‌తో మీ కారు ఎక్స్టీరియర్‌ను మరింత అందంగా మార్చుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, April 26, 2014, 19:27 [IST]
English summary
The current trend is wrapping a car in vinyl rather than getting a custom paint job. This is much faster and also hassle-free. The cost of vinyl wrapping too isn't astronomical and will save you money over traditional paint jobs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+