రతన్ టాటాకు మరో అరుదైన గౌరవ పురస్కారం!
టాటా గ్రూప్ అధినేత రతన్ టాటాకు మరొక అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ అందించే అత్యతున్నత పురస్కారమైన 'నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (జిబిఈ)' మనదేశ పారిశ్రామిక దిగ్గజాన్ని వరించింది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ యునెటైడ్ కింగ్‌డమ్ అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడు కూడా రతన్ టాటానే కావటం గర్వించదగిన విషయం.
ఈ 'నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (జిబిఈ)' పురస్కారాన్ని క్వీన్ ఎలిజబెత్-2 తరఫున, భారత్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ జేమ్స్ బెవాన్ రతన్ టాటాకు ప్రదానం చేశారు.
దైపాక్షిక సంబంధాలు, బ్రిటన్‌లో భారత పెట్టుబడుల వృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు రతన్ టాటా చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డు అందించినట్లు బ్రిటిష్ హైకమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.



Click it and Unblock the Notifications








