యార్క్ యూనివర్సిటీ నుంచి రతన్ టాటాకు గౌరవ డాక్టరేట్
భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కెనడాలోని యార్క్ యూనివర్శిటీ తమ గౌరవ డాక్టరేట్‌తో రతన్ టాటాను సత్కరించింది.
టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్‌కు కొత్త ఆవిష్కరణలు (న్యూ ఇన్నోవేషన్), కార్పొరేట్ సామాజిక బాధ్యతల (సీఎస్‌ఆర్) నిర్వహణకు గాను ఆయనకు ఈ డాక్టరేట్‌ను అందజేశారు.
టొరెంటోలో జరిగిన ఓ కార్యక్రమంలో రతన్ టాటాకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా యార్క్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డర్క్ మాటెన్ మాట్లాడుతూ.. ఎల్లవేళలా సంప్రదాయ విజ్ఞానానికిమించిన వినూత్న ఆలోచనలు రతన్ టాటాలో కనిపిస్తుంటాయని ఆయనను ప్రశంసించారు.

యార్క్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో రతన్ ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా రతన్ టాటా మాట్లాడుతూ.. ఎవరైనా పోటీ ప్రపంచంలోకి వెళ్లగలిగితే, అది వ్యాపార రంగం కానీ లేదా ప్రపంచంలోని ఏ ఇతర రంగాల్లో అయినా కానీ లీడర్లుగా ఎదుగుతారని చెప్పారు.
రతన్ టాటా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. "లక్షలాది మందికి మీకంటే తక్కువ అవకాశాలున్నాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు సాధించే విజయాలు మీ జీవితంలో చాలా మార్పులు తెస్తాయ"ని అన్నారు.


Click it and Unblock the Notifications








