ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో రెనో ఎంట్రీ లెవల్ కార్

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఈ ఏడాది జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఓ అద్భుతాన్ని ప్రపంచానికి పరిచయం చేయనుంది. రెనో తమ ఎంట్రీ లెవల్ కాన్సెప్ట్ కార్ వరల్డ్ ప్రీమియర్‌కు ఆటో ఎక్స్‌పోను వేదికగా ఎంచుకుంది. మన మార్కెట్లో ఆల్టో 800, హ్యుందాయ్ ఇయాన్ వంటి మోడళ్లకు సవాల్ విసిరేలా ఈ రెనో కాన్సెప్ట్ కారు ఉండనుంది. ఈ కాన్సెప్ట్ పేరు 'ఏ-ఎంట్రీ' A-Entry.

ప్రత్యేకించి మొట్టమొదటిసారిగా కారును కొనుగోలు చేసే వారిని (ఫస్ట్ టైమ్ బయ్యర్స్) లక్ష్యంగా చేసుకొని ఈ కారును అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెనో ఇండియా అందిస్తున్న చిన్న కారు పల్స్ హ్యాచ్‌బ్యాక్‌కు దిగువన ఈ చిన్న కారును ప్రవేశపెట్టనున్నారు. దీని ధరను రూ.3 లక్షలకు దిగువనే ఉంచేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఏ-ఎంట్రీ కాన్సెప్ట్ కారు ఈ ఏడాదిలోనే ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశాలున్నాయి.


ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో రెనో ఇండియా తమ ఏ-ఎంట్రీ కాన్సెప్ట్ కారుతో పాటుగా, ప్రస్తుతం అందిస్తున్న మోడళ్లలో కూడా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేయనుంది. ఇందులో ప్రధానంగా, పాపులర్ రెనో డస్టర్ ఎస్‌యూవీలో ఫేస్‌లిఫ్ట్ మరియు ఫ్లూయెన్స్‌లో అప్‌గ్రేడెడ్ వెర్షన్లను కూడా కంపెనీ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ రెండు మోడళ్లు గ్లోబల్ మార్కెట్లలో విడుదలై, మంచి సక్సెస్‌ను సాధించాయి.
Renault Fluence

ఇవే కాకుండా, రెనో ఇండియా అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ కొలియోస్‌లో కూడా అప్‌డేట్ వెర్షన్ విడుదల కానుంది. అయితే, స్కాలాలో మాత్రం ఎలాంటి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వచ్చే అవకాశం లేదు. కానీ ఇందులో ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గడచిన 2012 ఆటో ఎక్స్‌పో మాదిరిగానే, ఈసారి కూడా రెనో ఇండియా తమ ఎఫ్1 కారును ఇండియాకు తీసుకువచ్చే అవకాశాలున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, January 23, 2014, 16:26 [IST]
English summary
Renault will be displaying an array of products at the Delhi Auto Expo and a world premiere of a Renault concept car. The French car maker will debut its entry entry level car at this time. Renault will face stiff rivalry from the likes of Suzuki Alto 800 and Hyundai Eon. Renault calls its concept the A-Entry, the car will attract first time car buyers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+