సెప్టెంబర్ 24న రెనో డస్టర్ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ విడుదల

By Ravi

రెనో డస్టర్ ఆల్-వీల్ డ్రైవ్ (4x4) వేరియంట్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఇదివరకటి కథనాల్లో చెప్పుకున్నట్లున్నగానే, ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పవర్‌ఫుల్, స్టయిలిష్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'రెనో డస్టర్'లో ఓ ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) వేరియంట్‌ను ఈనెల 24న మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ వేరియంట్‌ను 'రెనో డస్టర్ ఏడబ్ల్యూడి' అని పిలువనున్నారు.

రెగ్యులర్ డస్టర్‌కు మరియు ఈ కొత్త డస్టర్ ఆల్-వీల్ డ్రైవ్‌కు డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండవు. అయితే, కొత్త రెనో డస్టర్ ఏడబ్ల్యూడిలో మాత్రం కొద్దిపాటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉంటాయి. ఈ వేరియంట్ స్మోక్డ్ హెడ్‌లైట్స్, గన్ మెటల్ ఫినిష్ట్ అల్లాయ్ వీల్స్, ఏడబ్ల్యూడి డెకాల్స్ (స్టిక్కర్స్)ను ఈ కొత్త వేరియంట్‌‌లో గమనించవచ్చు.

ఇంటీరియర్స్‌లో కొత్త త్రీ-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్పోర్టీయర్ స్టీరింగ్ వీల్, బ్రైట్ రెడ్ అండ్ గ్రే సీట్స్, కొత్త సెంటర్ కన్సోల్ (అడ్వెంచర్ ఎడిషన్ నుంచి గ్రహించబడినది), డ్యాష్‌బోర్డుపై గ్రే కలర్ సెంటర్ స్ట్రిప్ వంటి మార్పులున్నాయి.

ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, యాంబీంట్ టెంపరేచర్ గేజ్, రియల్‌టైమ్ ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ డిస్‌ప్లే, శాటిలైట్ నావిగేషన్ మరియు యూఎస్‌బి, ఆక్స్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఇంటిగ్రేటెడ్ 2-డిన్ ఆడియో సిస్టమ్‌తో పాటుగా ఏబిఎస్, ఈబిడి, బ్రేక్ అసిస్ట్, మరియు డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి.

రెనో డస్టర్ ఏడబ్ల్యూడిలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో అదే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 248 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ వేరియంట్ ధర రూ.12.5 లక్షల నుంచి రూ.13.5 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Monday, September 22, 2014, 15:47 [IST]
English summary
French carmaker Renault India will launch the new Duster AWD (All-Wheel-Drive) on September 24. The new Renault Duster AWD will boost some cosmetic upgrades inside and outside.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+