రెనో ఇండియా నుంచి మూడు కొత్త మోడళ్లు

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా భారత మార్కెట్లో మరో మూడు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో ముందుగా, ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో డస్టర్‌లో ఓ ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్ వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ఎమ్‌డి, సీఈ సుమిత్ సాహ్నే స్వయంగా వెల్లడించారు.

ఇది కూడా చదవండి: హోండా స్మాల్ కార్ కోసం 1 లీటర్ ఇంజన్

గడచిన సంవత్సరం (2013)లో రెనో ఇండియా మొత్తం అమ్మకాలలో దాదాపు 75 శాతం వాటా డస్టర్ ఎస్‌యూవీదేనని ఆయన తెలిపారు. ఈ ఏడాదిలో డస్టర్ 4x4ను విడుదల చేసిన తర్వాత, రెనో ఇండియా వచ్చే ఏడాదిలో మరో రెండు కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. ఇందులో ఒకటి మాస్ మార్కెట్‌ను ఉద్దేశించి, రూ.4 లక్షలకు దిగువన తయారు చేస్తున్న చిన్నకారు.

Renault India Plans To Launch 3 New Models

ఇక మూడవ ఉత్పత్తి విషయానికి వస్తే.. మల్టీ పర్సస్ వెహికల్ సెగ్మెంట్లో హోండా మొబిలియో, మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా జైలో, షెవర్లే ఎంజాయ్ వంటి మోడళ్లకు పోటీగా ఓ సరికొత్త ఎమ్‌పివిని ఇండియాలో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో 2.2 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్న రెనో ఇండియా తొమ్మిదవ స్థానంలో ఉంది..

ఇది కూడా చదవండి: స్మార్ట్ సిటీ కారుగా మారనున్న టాటా నానో

గడచిన 2013లో రెనో ఇండియా విడుదల చేసిన డస్టర్ ఎస్‌యూవీ భారత్‌లో అతికొద్ది కాలంలోనే మంచి సక్సెస్‌ను సాధించింది. ఇప్పటి వరకు ఈ మోడల్ అమ్మకాలు లక్ష యూనిట్లకు పైగా జరిగాయి. ప్రస్తుతం 2.2 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటాను మరో రెండు-మూడేళ్లలో 5 శాతానికి పెంచుకునే దిశగా కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తామని సాహ్నే తెలిపారు.

More from DriveSpark

Article Published On: Monday, August 18, 2014, 10:50 [IST]
English summary
French carmaker Renault plans to bring three new models in India eyeing the bigger market share of passenger car market. The all-wheel-drive variant of its SUV Duster, a small car in the sub-Rs 4 lakh range and a new multi-purpose vehicle (MPV) are lined up from Renault India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+