సెప్టెంబర్‌లో రెనో డస్టర్ 4x4 విడుదల

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పవర్‌ఫుల్, స్టయిలిష్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'రెనో డస్టర్'లో ఓ ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్‌ను దేశీయ విపణిలో కూడా విడుదల చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం.

వాస్తవానికి రెనో ఇండియా ఇప్పటికే తమ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ డస్టర్ ఎస్‌యూవీని చెన్నైలోని ఓరగడం వద్ద ఉన్న రెనో-నిస్సాన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. అయితే, ఈ ఫోర్-వీల్ డ్రైవ్ డస్టర్‌ను డాసియా బ్యాడ్జ్‌తో యూరప్ మార్కెట్లలో మాత్రమే విక్రయిస్తున్నారు.

భారత మార్కెట్లో కూడా ఆల్ వీల్ డ్రైవ్ మోడళ్లకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ కొత్త వేరియంట్ డస్టర్‌ను ఇక్కడి మార్కెట్లో కూడా విడుదల చేయాలని రెనో ఇండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే, సెప్టెంబర్ ఈ మోడల్‌ను విడుదల చేసేందుకు కంపెనీ యోచిస్తోంది.

Renault India To Launch Duster 4x4 This September

ప్రస్తుతం భారత మార్కెట్లో రెనో డస్టర్ కేవలం టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. కాగా.. ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్ కలిగిన రెనో డస్టర్‌ను కేవలం 110పిఎస్ డీజిల్ వేరియంట్లో మాత్రమే ప్రవేశపెట్టనున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.

ఈ వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానుంది. రెనో డస్టర్ ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్లో ఉపయోగించనున్న ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను తమ భాగస్వామి కంపెనీ నిస్సాన్ అందిస్తున్న ఎక్స్-ట్రైల్ ఎస్‍‌యూవీ నుంచి గ్రహించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న రెనో డస్టర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లో 102 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.6లీటర్ ఇంజన్‌, డీజిల్ వేరియంట్‌లో 85పిఎస్, 110పిఎస్‌ల పవర్‌తో 1.5లీటర్ డిసిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 13.24 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్స్ లీటరుకు (85 పిఎస్ వెర్షన్) 20.45 కి.మీ. మైలేజీని, (110 పిఎస్ డీజిల్) 19.01 కి.మీ. మైలేజీనిస్తాయి.

More from DriveSpark

Article Published On: Thursday, August 7, 2014, 16:52 [IST]
English summary
Renault was the first manufacturer to successfully exploit the compact SUV segment in India. It was the only compact SUV when launched, and the French manufacturer stole a major chunk of sales from its competition.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+