హైదరాబాద్‌లో నాల్గవ రెనో ఇండియా డీలర్‌షిప్ ప్రారంభం

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనో మన నవాబుల నగరంలో తమ డీలర్‌షిప్ నెట్‌‌వర్క్‌ను విస్తరించుకుంటోంది. హైదరాబాద్‌లో రెనో ఇండియా తమ నాల్గవ డీలర్‌షిప్ కేంద్రాన్ని కొండాపూర్ మెయిన్ రోడ్ వద్ద ప్రారంభించింది. ఇప్పటికే నగరంలో మూడు రెనో డీలర్‌షిప్‌లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ మార్కెట్లో హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

కొండాపూర్ మెయిన్‌రోడ్‌లోని సిటీ ఆఫ్ పెరల్స్ వద్ద రెనో హైటెక్ సిటీ పేరిట ఈ కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించారు. ఈ డీలర్‌షిప్ కోసం రెనో ఇండియా నగరానికి చెందిన ఆటోలాజిక్ మోటార్స్ ఇండియాతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. హైదరాబాద్‌లో నాల్గవ షోరూమ్ ఏర్పాటుతో దక్షిణాధి భారతదేశంలో మొత్తం రెనో అవుట్‌లెట్‌ల సంఖ్య 32కి చేరుకుందని కంపెనీ పేర్కొంది.

Renault India

హైదరాబాద్‌లో కొత్త డీలర్‌షిప్‌ను ఏర్పాటు చేయటం తమకు గర్వించదగిన విషయమని, ఆటోలాజిక్ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి పనిచేయటం సంతోషంగా ఉందని, తమ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తామని రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, కంట్రీ సీఈఓ సుమిత్ సాహ్నే తెలిపారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ మార్కెట్లో హోండా మొబిలియో విడుదల

రెనో హైటెక్ సిటీ షోరూమ్ 8,500 చ.అ. స్థలాన్ని కలిగి ఉంటుంది, ఇందులో తొమ్మిది కార్ మోడళ్లను ప్రదర్శనకు ఉంచవచ్చు. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే రెనో దేశవ్యాప్తంగా 141 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసుకోగలిగింది. ఈ ఏడాది చివరి నాటికి తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని 175కు పెంచుకోవాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 13, 2014, 11:42 [IST]
English summary
French carmaker Renault India has inaugurated its fourth dealership in Hyderabad. The new outlet, Renault Hitech City, is located at Kondapur Main Road, in the City of Pearls.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+