రెనో ట్రాఫిక్ ఆవిష్కరణ, త్వరలో విడుదల కావచ్చని అంచనా!

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో తాజాగా 'ట్రాఫిక్' (Trafic) అనే కొత్త వ్యాన్‌ను ఆవిష్కరించింది. అంతర్జాతీయ మార్కెట్ల కోసం రూపొందించిన ఈ రెనో ట్రాఫిక్ వ్యాన్ మూడవ తరానికి (థర్డ్ జనరేషన్) చెందినది. ఇది ఈ సెగ్మెంట్లోని ఫోక్స్‌వ్యాగన్ ట్రాన్స్‌‌పోర్టర్, ఫోర్డ్ ట్రాన్సిట్ కస్టమ్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

ఈ కొత్త 2014 రెనో ట్రాఫిక్ వ్యాన్ కొత్త షేపును కలిగి ఉండి, బోల్డ్ లుక్‌తో విశాలంగా ఉంటుంది. బెటర్ అప్పీరెన్స్ కోసం హెడ్‌లైట్స్, విండ్‌స్క్రీన్‌లను రివైజ్ చేశారు. డెంట్స్ నుంచి రక్షించేందుకు వీలుగా ఈ వ్యాన్ చుట్టూ ప్రొటెక్టివ్ వ్రాప్ ఉంటుంది. ఈ వ్యాన్ 1.6 లీటర్ డిసిఐ ఇంజన్‌తో ఆఫర్ చేయబడుతుంది. ఈ ఇంజన్ మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Renault Trafic

ఈ ఇంజన్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అందులో ఒకటి సింగిల్ వేరియబల్ జియోమెట్రీ టర్బో, ఇది 15 శాతం అదనపు మైలేజీనిస్తుంది. ఇకపోతే రెండవ ఇంజన్ ట్విన్-టర్బో ఆప్షన్, ఇది 47 ఎమ్‌పిజి ఫ్యూయెల్ ఎకానమీని ఆఫర్ చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు సుపీరియర్ లో ఎండ్ టార్క్ మరియు క్విక్ పికప్‌ను కలిగి ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Saturday, March 22, 2014, 15:12 [IST]
English summary
Renault has been giving its customers great looking cars, this time they will be offering a new van called Trafic. The French based car manufacturer has revealed the third gen Trafic van. It is expected to compete with the Transporter offered by VW and Ford's Transit Custom in international markets.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+