రిపోర్ట్: 1 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్న హోండా

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా తమ అమేజ్, సిటీ, మొబిలియో వంటి డీజిల్ కార్ల విడుదలతో భారత మార్కెట్లో కేవలం రెండేళ్లలోనే తమ మార్కెట్ వాటాను రెట్టింపు చేసుకొని, మంచి వృద్ధిని కనబరుస్తోంది. కేవలం క్లాస్ మార్కెట్‌నే కాకుండా మాస్ మార్కెట్‌ను ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో హోండా కార్స్ ఇండియా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఓ 1 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను తయారు చేస్తున్నట్లు సమాచారం.

స్మాల్ కార్ (పెట్రోల్) సెగ్మెంట్లో మార్కెట్ లీడర్స్‌గా ఉన్న మారుతి సుజుకి, హ్యుందాయ్ కంపెనీలు ధీటుగా నిలిచేందుకు హోండా సన్నాహాలు చేస్తోంది. ఈ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌గా ఉన్న మారుతి ఆల్టో, వ్యాగన్ఆర్, సెలెరియో, హ్యుందాయ్ ఇయాన్, శాంత్రో వంటి మోడళ్లకు సవాలు విసిరేలా హోండా ఓ చిన్న కారును తయారు చేస్తోందని, అందుకోసమే ఈ 1 లీటర్ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తోందనే గుసగలు వినిపిస్తున్నాయి.

honda working on 1 litre petrol engine

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, హోండా అభివృద్ధి చేస్తున్న ఈ 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ స్టాండర్డ్ (సహజ సిద్ధంగా ఉత్పత్తి అయ్యే శక్తితో) మరియు టర్బోచార్జ్డ్ (కృత్రిమంగా ఉత్పత్తి చేసే అధిక శక్తితో) వెర్షన్లలో లభ్యం కానుంది. వచ్చే 2017 నాటికి హోండా మార్కెట్లోకి తీసుకురాబోయే ఓ మాస్ మార్కెట్ స్మాల్ కారులో ఈ ఇంజన్లను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిన్న కారును ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న బ్రయో కన్నా దిగువన ప్రవేశపెట్టనున్నారు.

హోండా పరిచయం చేయనున్న ఈ ఎంట్రీ లెవల్ లో కాస్ట్ స్మాల్ కార్ తయారీ కోసం కంపెనీ గుజరాత్‌లో 3వ కార్ ప్లాంట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిన్న కారు ధర రూ.4 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం హోండా విక్రయిస్తున్న బ్రయో, అమేజ్ కారులో 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, August 16, 2014, 15:39 [IST]
English summary
According to FE report, Japanese auto major Honda is planning to bring a mass market product to challenge the supremacy of Maruti Suzuki and Hyundai. The carmaker is developing a 1-litre petrol engine, the smallest in its car range globally, which, it hopes, will help it gain a foothold in the small car segment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+