2018 నాటికి అన్ని కార్లలో రివర్స్ పార్కింగ్ కెమెరా తప్పనిసరి!

By Ravi

కారులో ప్రయాణించే వారి భద్రత అలాగే రోడ్డుపై నడిచి వెళ్లే వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని, 2018 నాటికి తమ దేశంలో తయారయ్యే అన్ని కార్లలో రివర్స్ పార్కింగ్ కెమెరాను తప్పనిసరి చేయాలని అమెరికా యోచిస్తోంది. ఈ మేరకు యూఎస్ నేషనల్ హైవే సేఫ్టీ ట్రాన్స్‌పోర్టేషన్ ఏజెన్సీ (ఎన్‌హెచ్‌టిఎస్ఏ) కొత్త నిబంధనను పరిచయం చేయనుంది.

ఈ కొత్త రూల్ ప్రకారం, మే 1, 2018 నాటికి అన్ని కార్లలో రివర్స్ పార్కింగ్ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి. అయితే, ఈ నిబంధనలో చిన్న సడలింపు కూడా ఉంది. ఈ నిబంధన అన్ని రకాల కార్లకు వర్తించదు. ఏ కారైతే 10,000 పౌండ్లకు మించి ధరను కలిగి ఉంటుందో అలాంటి కార్లలో మాత్రమే ఈ నిబంధన తప్పనిసరి కానుంది.

రివర్స్ పార్కింగ్ కెమెరా పార్కింగ్ సెన్సార్ల మాదిరిగానే పనిచేస్తుంది. కొన్ని హై-ఎండ్ కార్లలో ఇది ఇన్‌బిల్ట్‌గా లభిస్తుంది. ఏ కారుకైనా (అతి చవకైన కారుకైనా కూడా) రివర్స్ పార్కింగ్ కెమెరాను అమర్చుకోవచ్చు.

రివర్స్ పార్కింగ్ కెమెరాల సాయంతో కారు వెనుక వైపు ఉన్న వస్తువులు/మనుషులను వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండానే డ్యాష్‌బోర్డుపై (లేదా రియర్ వ్యూ మిర్రర్‌పై) ఉండే డిజిటల్ డిస్‌ప్లేలో స్పష్టంగా చూడొచ్చు.

Parking Camera Compulsory
మనదేశ మార్కెట్లో వీటి ధరలు రూ.5,000 నుంచి అందుబాటులో ఉన్నాయి. మరి ఇండియాలో కూడా ఇలాంటి రూల్ వస్తే ఎలా ఉంటుంది..?

More from DriveSpark

Article Published On: Wednesday, April 2, 2014, 17:50 [IST]
English summary
In an attempt to make driving experience safer for both people in the car as well as people walking on the road. The National Highway Safety Transportation Agency (NHTSA) will be introducing a new compulsion.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+