రోల్స్ రాయిస్ నుంచి మరో సరికొత్త మోడల్; 2016 నాటికి సిద్ధం
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ మరో రెండేళ్లో ఓ సరికొత్త మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఇప్పటికే తాము ఓ స్పెషల్ ప్రాజెక్టుపై పనిచేస్తున్నామని రోల్స్ రాయిస్ ధృవీకరించింది. ఓ కొత్త ప్లాట్‌ఫామ్‌ను అభవృద్ధి చేస్తున్న ఈ బ్రిటీష్ బ్రాండ్ 2016 నాటికి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనుంది.
ఇది కూడా చదవండి: వజ్రాలు పొదిగిన రోల్స్ రాయిస్ సెలెస్టియల్ ఫాంటమ్
రోల్స్ రాయిస్ ప్రస్తుతం ఫాంటమ్, ఘోస్ట్ మరియు వ్రైత్ మోడళ్లను ఆఫర్ చేస్తోంది. రోల్స్ రాయిస్ కార్లంటేనే సుపీరియర్ బిల్డ్ క్వాలిటీ, ఆల్టిమేట్ లగ్జరీ మరియు పవర్‌ఫుల్ ఇంజన్లకు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో, రోల్స్ రాయిస్ నుంచి రానున్న సరికొత్త మోడల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

ఈ విషయం గురించి రోల్స్ రాయిస్ మోటార్స్ కార్స్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోర్స్టెన్ ముల్లో ఓట్‌వోస్ మాట్లాడుతూ.. తమ కొత్త మోడల్ అభివృద్ధి గురించి ధృవీకరించడానికి తనకెంతో సంతోషంగా ఉందని, ఈ కొత్త మోడల్ రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి తెర లేపుతుందని అన్నారు.
ఇది కూడా చదవండి: పాత బెంజ్ కారును రోల్స్ రాయిస్ కారుగా మార్చిన మెకానిక్
కంపెనీ తయారు చేయనున్న ఈ కొత్త మోడల్‌ను ప్రస్తుత ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించకుండా పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నట్లు సమాచారం. 2016 నాటికి ఇది పూర్తిస్థాయిలో సిద్ధం కానుంది. ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించేందుకు మాత్రం రోల్స్ రాయిస్ సంస్థ నిరాకరిస్తోంది.


Click it and Unblock the Notifications








