రూమర్: మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ 4x2 ఆటోమేటిక్ వస్తోంది!

By Ravi

జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాజెరో స్పోర్ట్ ప్రీమియం ఎస్‌యూవీ ప్రస్తుతం ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. అయితే, ఇందులో టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్ కలిగిన పాజెరో స్పోర్ట్ ఎస్‌యూవీని మిత్సుబిషి ఈనెలలో మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ కొత్త మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ 4x2 కేవలం టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తోనే కాకుండా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇది నవంబర్ 15న మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ 4x2 ఆటోమేటిక్ ఇంజన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడల్‌లో ఉపయోగిస్తున్న 2.5 లీటర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌నే ఈ కొత్త వేరియంట్ పాజెరో స్పోర్ట్‌లోను ఉపయోగించవచ్చని అంచనా. ఈ ఇంజన్ గరిష్టంగా 178 పిఎస్‌ల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్‌లో 4x4 పాజెరో స్పోర్ట్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగిస్తున్నారు. కాగా.. 4x2 పాజెరో స్పోర్ట్‌లో 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించనున్నారు.

Mitsubishi Pajero Sport

ఈ కొత్త వేరియంట్ మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ 4x2 ధర, ఫోర్-వీల్ డ్రైవ్ మ్యాన్యువల్ పాజెరో స్పార్ట్ ధర కన్నా తక్కువగా ఉండనుంది. ప్రస్తుత మోడల్‌లో (4x4లో) లభిస్తున్న దాదాపు అన్ని ఫీచర్లను ఈ కొత్త మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ (4x2)లో కూడా కొనసాగించే ఆస్కారం ఉంది. ప్రస్తుతం దేశీయ విపణిలో మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ 4x4 మ్యాన్యువల్ ధర రూ.23.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ నేపథ్యంలో, మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ 4x2 ధర రూ.20 లక్షలకు ఎగువన ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 4, 2014, 14:47 [IST]
English summary
According to sources, Mitsubishi is expected to launch Pajero Sport 4x2 Automatic in India on25th November 2014. Stay tuned for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+