రెడ్ బుల్ ఎఫ్1 టీమ్‌కు గుడ్‌బై చెప్పనున్న సెబాస్టియన్ వెటెల్
రెడ్ బుల్ ఫార్ములా వన్ జట్టుకు చెందిన రేసర్ సెబాస్టియన్ వెటెల్, ఇక ఆ జట్టుకు గుడ్‌బై చెప్పనున్నాడు. ప్రస్తుత ఫార్ములా వన్ సీజన్ ముగిసిన తర్వాత సెబాస్టియ్ వెటెల్ తమ జట్టు నుంచి తొలగిపోతారని రెడ్ బుల్ ఇప్పటికే ప్రకటించింది. కాగా.. వెటెల్ వచ్చే ఏడాదిలో రెడ్ బుల్ జట్టు నుంచి ఫెరారీ జట్టులోకి వెళ్లనున్నట్లు సమాచారం.
ఫెరారీ జట్టు నుంచి ఫెర్నాండో అలోన్సో తొలగిపోతుండటంతో, ఆ స్థానాన్ని వెటెల్ భర్తీ చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా.. అల్సోనో మెక్‌లారెన్ జట్టులోకి జంప్ కొట్టవచ్చని తెలుస్తోంది. సెబాస్టియన్ వెటెల్ రెడ్ బుల్ జట్టులో అత్యంత కీలకంగా వ్యవరించాడు. ఎన్నో విజయాలను ఆ జట్టుకు తెచ్చిపెట్టాడు.

ఇండియాలో జరిగిన మూడు గ్రాండ్ ప్రి సిరీస్‌లలో కూడా సెబాస్టియన్ వెటెల్ వరుస విజయాలను నమోదు చేశాడు. గతంలో (2004)లో వరుసగా 7 విజయాలను సాధించిన ఎఫ్1 డ్రైవర్‌గా మైఖేలు షుమాకర్ రికార్డు సృష్టించగా, 2013లో జరిగిన అబుదాబి గ్రాండ్‌ప్రిలో విజయం సాధించిన వెటల్, షుమాఖర్‌తో ధీటుగా ఈ రికార్డును సమం చేశాడు.


Click it and Unblock the Notifications








