పర్యావరణ దినోత్సవం రోజున స్కొడా ఉచిత కాలుష్య తనిఖీ

By Ravi

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (ప్రతి ఏటా జూన్ 5వ తేదీ)ను పురస్కరించుకొని స్కొడా ఇండియా రేపు (04.05.2014వ తేదీన) దేశవ్యాప్తంగా 'ఉచిత కాలుష్య తనిఖీ' (ఫ్రీ పొల్యూషన్ చెకప్)ను నిర్వహించనుంది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్)తో కలిసి స్కొడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

పర్యావరణ కాలుష్యం గురించి స్కొడా యజమానుల్లో అవగాహనను పెంచేందుకే ఈ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. భవిష్యత్తు కోసం కాలుష్య రహిత సమాజాన్ని అందించేందుకు తమ కట్టుబాటులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న స్కొడా అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలు, సర్వీస్ సెంటర్ల వద్ద జూన్ 5వ తేదీన ఫ్రీ పొల్యూషన్ చెకప్ నిర్వహించనున్నారు (స్కొడా వాహనాలకు మాత్రమే).

Skoda India Launches Pollution Check Initiative

నిపుణులైన స్కొడా ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఈ చెకప్ నిర్వహిస్తారు. ఈ క్యాంప్‌లో కాలుష్యం అధికంగా ఉండే వాహనాల ఇంజన్లను క్లీన్ చేయటం, వాహన యజమానులకు చిట్కాలు తెలియజేయటం చేస్తారు. అంతేకాకుండా, ఈ క్యాంప్‌లో పాల్గొన్న స్కొడా యజమానులకు ఉచితంగా పియూసి (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తారు. ఈ సర్టిఫికెట్‌ను స్కొడా అలాగే సియామ్ ఆథరైజ్ చేస్తుంది. మరి మీ స్కొడా కారును చెకప్‌కు తీసుకువెళ్తున్నారా..?

More from DriveSpark

Article Published On: Wednesday, June 4, 2014, 10:27 [IST]
English summary
Skoda India has launched a 'Free Pollution Check' initiative with the help of Society of Indian Automobile Manufacturers(SIAM). The check up camp will commence on June 5th, 2014. The Volkswagen owned group is launching the campaign, to promote World Environment Day.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+