ర్యాపిడ్ సెడాన్‌పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తున్న స్కొడా
చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ ర్యాపిడ్‌లో, గడచిన సెప్టెంబర్ నెలలో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే, గత కొంత కాలంగా అమ్మకాలు తగ్గుముఖ పడుతున్న నేపథ్యంలో, ర్యాపిడ్ అమ్మకాలను పెంచుకునేందుకు స్కొడా దీనిపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
స్కొడా ర్యాపిడ్‌పై కంపెనీ అందిస్తున్న ఆఫర్‌లో.. రూ.30,000 ఎక్సేంజ్ బోనస్, మొదటి సంవత్సరం ఉచిత బీమా, నాలుగేళ్ల పాటు ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు వారంటీ కలిసి ఉన్నాయి. కార్పోరేట్ల కోసం కంపెనీ ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తోంది. అయితే, కంపెనీ అందిస్తున్న స్కొడా ర్యాపిడ్ డిఎస్‌జి డీజిల్ ఆటోమేటిక్ మోడల్‌పై మాత్రం ఈ ఆఫర్లు వర్తించవు.

దేశీయ విపణిలో స్కొడా ర్యాపిడ్ పెట్రోల్ వెర్షన్ ధరలు 7.22 లక్షల నుంచి రూ.9.82 లక్షల మధ్యలోను, డీజిల్ వెర్షన్ ధరలు రూ.8.39 లక్షల నుంచి రూ.9.87 లక్షల మధ్యలోను ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
రూ.1,000లకు పైగా విలువైన కార్ యాక్ససరీల కొనుగోలుపై ఉచిత షిప్పింగ్
కొత్త 2014 స్కొడా ర్యాపిడ్ సెడాన్ ఆప్షనల్ బ్లాక్ ప్యాకేజ్‌తో లభిస్తుంది. ఈ ప్యాకేజ్‌లో భాగంగా.. బ్లాక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ ఫాగ్ ల్యాంప్స్, బ్లాక్ గ్రిల్ అండ్ లోగో, బ్లాక్ వింగ్ మిర్రర్స్, బ్లాక్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, బ్లాక్ గ్లాసీ రూఫ్ మరియు బ్లాక్ సైడ్ ఫోయిల్స్‌లు యాక్ససరీలుగా లభిస్తాయి. స్కొడా ర్యాపిడ్ ఈ సెగ్మెంట్లోని హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.


Click it and Unblock the Notifications








