పండుగ సీజన్‌లో 2014 స్కొడా యెటి ఫేస్‌లిఫ్ట్ విడుదల

By Ravi

చెక్ రిపబ్లికన్ కార్ మేకర్ స్కొడా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన 2014 యెటి ఎస్‌యూవీని కంపెనీ రానున్న పండుగ సీజన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కొత్త యెటి సెడాన్‌ను స్కొడా భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తుండా పలుమార్లు కమెరాకు కూడా చిక్కింది. సెప్టెంబర్ 2014లో ఇది విడుదల కానుంది.

స్కొడా ఇప్పటికే తమ అప్‌గ్రేడెడ్ 2014 యెటి ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లోల విక్రయించడం ప్రారంభించింది. యూరోప్ మార్కెట్ల కోసం తయారు చేసిన యెటి ఎస్‌యూవీనే స్కొడా ఇండియన్ మార్కెట్లోను ప్రవేశపెట్టనుంది. మునుపటి తరం స్కొడా యెటితో పోల్చుకుంటే, ఈ కొత్త మోడల్ మరింత విశాలంగాను మరియు విలాసవంతంగాను ఉండనుంది.

Skoda India To Launch 2014 Yeti In September

కొత్త స్కొడా యెటి కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానున్నట్లు సమాచారం. ఇందులో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 108 హార్స్ పవర్‌ల శక్తిని, 250 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో లభ్యం కానుంది.

ఇందులో ఓ పవర్‌ఫుల్ వెర్షన్ కూడా అందుబాటులో ఉండనుంది. ఆ పవర్‌ఫుల్ వేరియంట్లో కొంచెం అప్‌ట్యూన్ చేయబడిన 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 138 హార్స్ పవర్‌ల శక్తిని, 320 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 7, 2014, 10:15 [IST]
English summary
Skoda had confirmed they would be launching the new Yeti in India in 2014 itself. It has been spied testing often in India and is slated to be launched in September. It will replace the previous generation Yeti available in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+