స్కొడా వాహనాల వినియోగదారుల కోసం ఫ్రీ చెకప్ క్యాంప్!
స్కొడా ఆటో ఇండియా తమ వినియోగదారుల కోసం ఉచిత సమ్మర్ చెకప్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఈ వేసవి సెలవుల్లో దూర ప్రయాణాలుకు వెళ్లే వారు మరియు ఈ వేడి వాతావరణానికి అనువుగా తమ స్కొడా వాహనాలను కండిషన్‌లో ఉంచుకోవాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకొని, మెరుగైన వినియోగదారుని సేవలు అందించే దిశలో భాగంగా కంపెనీ సమ్మర్ క్యాంప్‌ను ప్రారంభించింది.
ఈ సమ్మర్ చెకప్ క్యాంప్‌లు మే 2, 2014వ తేదీన ప్రారంభమై మే 31, 2014 వరకు కొనసాగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న స్కొడా డీలర్‌షిప్, సర్వీస్ సెంటర్ల ద్వారా ఈ సమ్మర్ చెకప్ క్యాంప్‌లను నిర్వహించనున్నారు. ఈ సమ్మర్ చెకప్ క్యాంప్‌కు తీసుకు వచ్చే అన్ని రకాల స్కొడా వాహనాలకు 16 పాయింట్ ఫ్రీ చెకప్ చేసి, లోపాలు ఏవైనా ఉంటే సరిచేస్తామని కంపెనీ పేర్కొంది.
ఈ ఫ్రీచెకప్‌లో భాగంగా.. ఎయిర్ కండిషన్, ఇంజన్, స్టీరింగ్, క్లచ్, ఎలక్ట్రికల్ సిస్టమ్, టైర్లు, చక్రాలు మొదలైన వాటిని పరీక్షిస్తారు. ఈ వేసవిలో తమ స్కొడా వాహనాల్లో సుదూర ప్రయాణాలుక వెళ్లే తమ కస్టమర్లు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకే ఈ ఫ్రీ సమ్మర్ చెకప్ క్యాంపులు నిర్వహిస్తున్నామని స్కొడా ఆటో ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.



Click it and Unblock the Notifications








