భారత మార్కెట్ నుంచి స్కొడా లారా సెడాన్ తొలగింపు

By Ravi

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఆటో ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ప్రీమియం సెడాన్ స్కొడా లారా (Skoda Laura)ను భారత మార్కెట్ నుంచి తొలగించి వేసింది. ప్రస్తుతం స్కొడా ఇండియా వెబ్‌సైట్‌లో ఈ మోడల్ కనిపించట్లేదు. స్కొడా ఇండియా లారా సెడాన్‌ను తొలిసారిగా 2005లో భారత మార్కెట్లో విడుదల చేసింది.

ఇదివరకు కంపెనీ విక్రయిస్తున్న ఆక్టావియా ఎమ్‌కె1 (Octavia Mk1) మోడల్‌తో పాటుగానే లారా సెడాన్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేసేది. కాగా.. 2009లో స్కొడా తమ లారా సెడాన్‌లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పరిచయం చేసింది. మొన్నిటి వరకు ఇది ప్రస్తుత తరం సరికొత్త ఆక్టావియా సెడాన్‍‌తో పాటుగా లభ్యమవుతూ వచ్చింది.

వాస్తవానికి, స్కొడా ఇండియా ఇటీవల విడుదల చేసిన సరికొత్త ఆక్టావియా ఎమ్‌కె2 మోడలే లారా. అంతర్జాతీయ మార్కెట్లలో ఇది ఆక్టావియా పేరుతో అమ్ముడుపోతుంది. ఏదేమైనప్పటికీ, కొత్త ఆక్టావియా రాకతో లారా అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టడం కూడా ఈ మోడల్‌ను మార్కెట్ నుంచి తొలగించడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.

Skoda Laura RS

స్కొడా లారా రెండు ఇంజన్ ఆప్షన్లతో లభ్యమయ్యేది. అవి, 1.8 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం అవుతుండేది. ఈ ఇంజన్ గరిష్టంగా 160 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇక డీజిల్ వెర్షన్ విషయానికి వస్తే, ఇది రెండు వేరియంట్లలో లభ్యమయ్యేది. అందులో ఒకటి 110 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంజన్, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇకపోతే, రెండవది 140 బిహెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంజన్, ఇది 6-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 8, 2014, 14:16 [IST]
English summary
Skoda Laura has at last been taken out the automaker's India website, signalling the retirement of the Laura brand from its lineup. The Laura was in fact the the Octavia Mk2, and it was sold with the Octavia name in international markets. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+