నెక్స్ట్ జనరేషన్ స్కొడా ఫ్యాబియా సిద్ధం; 2015లో విడుదల

By Ravi

స్కొడా ఫ్యాబియాలో ఓ కొత్త 2015 వెర్షన్‌ను కంపెనీ విడుదల చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనంలో తెలుసుకున్నాం. ఈ నేపథ్యంలో, నెక్స్ట్ జనరేషన్ స్కొడా ఫ్యాబియా అఫీషియల్ స్కెచ్‌లను కంపెనీ విడుదల చేసింది. ఈ ఏడాది జరగనున్న 2014 ప్యారిస్ మోటార్ షోలో స్కొడా తమ కొత్త ఫ్యాబియాను ప్రపంచానికి పరిచయం చేయనుంది.

సరికొత్త 2015 స్కొడా ఫ్యాబియాలో కాస్మోటిక్ మార్పులతో పాటుగా మెకానికల్ మార్పులు కూడా ఉండనున్నాయి. పెట్రోల్ వెర్షన్‌లో 1.0 లీటర్, 3-సిలిండర్ ఇంజన్ మరియు 1.2 లీటర్, 4-సిలిండర్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. డీజిల్ వెర్షన్ 1.4 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌తో లభ్యం కానుంది. ఇందులో ఓ గ్రీన్‌లైన్ డీజిల్ ఇంజన్‌ను కూడా 2015లో పరిచయం చేయనున్నారు.

Skoda To Reveal Next Generation Fabia At 2014 Paris Motor Show

ఈ ఇంజన్లన్నీ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో లభిస్తాయి. ఈ ఇంజన్‌లను కస్టమర్ల కోరిక మేరకు ట్యూన్ చేసి ఇస్తారు. ఉదాహరణకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను 60 బిహెచ్‌పిల నుంచి 110 బిహెచ్‌పిల వరకు, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను 75 బిహెచ్‌పిల నుంచి 105 బిహెచ్‌పిల వరకు ట్యూన్ చేసిస్తారు. వచ్చే ఏడాదిలో ఈ కొత్త స్కొడా ఫ్యాబియా ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల కానుంది.

ఇండియన్ మార్కెట్‌కు రానున్న నెక్స్ట్ జనరేషన్ స్కొడా ఫ్యాబియాలో 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. స్కొడా ఇండియా తొలిసారిగా 2008లో ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. నిర్మాణ నాణ్యత, సౌకర్యం, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో ఫ్యాబియా మంచి ప్రీమయం కార్‌గా నిలిచింది.

More from DriveSpark

Article Published On: Friday, August 8, 2014, 15:36 [IST]
English summary
The next-generation Skoda Fabia will make its debut in October in 2014 Paris Motor Show this October.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+