ఫేస్‌లిఫ్ట్ 2014 స్కొడా యెటి ఎస్‌యూవీ!

By Ravi

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ మరియు ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన ఆటోమొబైల్ బ్రాండ్ 'స్కొడా' భారత మార్కెట్లో విక్రయిస్తున్న స్కొడా యెటి (Skoda Yeti) ఎస్‌యూవీలో త్వరలోనే ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ మార్కెట్లోకి రానుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే నెలలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో స్కొడా తమ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ యెటి ఎస్‌యూవీని ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త స్కొడా యెటికి సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.

స్కొడా యెటి రెండు ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్ కలిగిన స్కొడా యెటిలో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 110 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్ కలిగిన స్కొడా యెటిలో కూడా 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. అయుతే, ఈ ఇంజన్ గరిష్టంగా 140 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కానీ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

Skoda Yeti To Get A Facelift For 2014

ప్రస్తుతానికి స్కొడా యెటి ఆటోమేటిక్ వేరియంట్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. కానీ దీని ధరలో ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. స్కొడా యెటి 110 పిఎస్, 4x2 వెర్షన్ ధర రూ.15 లక్షలు, స్కొడా యెటి 140 పిఎస్, 4x4 వెర్షన్ ధర రూ.19 లక్షలు ఉండొచ్చని అంచనా.

సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లు, మోడ్రన్ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేసిన కొత్త స్కొడా యెటిపై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ ఫొటోను బట్టి చూస్తే, 2014 స్కొడా యెటి కొత్త డిజైన్‌తో రిఫ్రెష్డ్ లుక్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ముందు వైపు కొత్త బంపర్, కొత్త గ్రిల్, కొత్త బ్యాడ్జ్‌లతో చాలా నీట్‌గా కనిపిస్తుంది. దీని వెనుక డిజైన్‌ను గమనిస్తే, C ఆకారంలో ఉండే టెయిల్ ల్యాంప్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. బాడీ కలర్డ్ బంపర్స్, సరికొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ మరొక ప్రత్యేకత.

ఈ కొత్త స్కొడా యెతి ఎస్‌యూవీ ఇంటీరియర్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014 స్కొడా యెతి ఎస్‌యూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి. ఈలోపుగా స్కొడా యెటి వీడియోని వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/bSG5YniSnr0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Thursday, January 23, 2014, 11:10 [IST]
English summary
Skoda will showcase its facelifted Yeti at the Delhi Auto Expo this February, however the launch of the car will be later into the year. The Yeti will be offered in two drivetrains both manual. The 4x2 option will feature a 5-speed manual and a 2-litre diesel engine, churning power of 110PS. It will be front wheel driven.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+