సోనాలికా నుంచి ఎయిర్ కండిషన్డ్ ట్రాక్టర్
పంజాబ్‌కు చెందిన ప్రముఖ ట్రాక్టర్ల తయారీ కంపెనీ సోనాలికా గ్రూప్ గడచిన జూన్ నెలలో అన్ని వాతావరణాలకు అనువుగా ఉండేలా ఎయిర్ కండిషన్, హీటర్ ఆప్షన్‌తో కూడిన హెవీ డ్యూటీ ట్రాక్టర్ 'వరల్డ్‌ట్రాక్ 90 హెచ్‌పి'ని భారత విపణిలో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు ఈ మోడల్ మన రాష్ట్ర వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎయిర్ కండిషన్ ట్రాక్టర్
సోనాలికా వరల్డ్‌ట్రాక్ 90 హెచ్‌పి ట్రాక్టర్‌ను కంపెనీ హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఇందులో డ్రైవర్‌కు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండేలా డ్రైవర్ సీట్‌ను డిజైన్ చేశారు. టెలిస్కోపిక్ పవర్ స్టీరింగ్ ఇందులో మరో ప్రత్యేకత. ఈ ట్రాక్టర్‌లో ఉపయోగించిన 4 సిలిండర్, 90 హార్స్ పవర్ ఇంజన్ సాటిలేని పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

ఈ ట్రాక్టర్‌లో ఏసి/హీటర్ సదుపాయం ఉన్నప్పటికీ మైలేజ్, పవర్ విషయంలో ఇది ఎక్కడా రాజీ పడదని కంపెనీ పేర్కొంది. ఈ సోనాలికా వరల్డ్‌ట్రాక్ 90 హెచ్‌పి హెవీ డ్యూటీ ట్రాక్ట్రర్ 2500 కేజీల పేలోడ్‌ను సునాయసంగా క్యారీ చేయగలదు. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 100 లీటర్లు.
ఇందులోని డ్రైవర్ క్యాబిన్‌లో డ్యూయెల్ స్పీకర్లతో కూడిన మ్యాజిక్ సిస్టమ్, కప్ హోల్డర్స్, ఈ మార్క్‌డ్ క్యాబిన్ గ్లాసెస్, ఫ్రంట్ అండ్ రియర్ వైపర్స్, ఆయిల్ బ్రేక్స్ వంటి ఫీచర్లతో ఇది లభిస్తుంది. సోనాలికా డీలర్లు/భాగస్వాముల ద్వారా ఈ ట్రాక్టర్ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రాక్టర్ సొంతం చేసుకొనేందుకు రైతులకు ఫైనాన్స్ సౌకర్యం కల్పించనున్నారు.


Click it and Unblock the Notifications








