మారుతి సుజుకి మినీ ట్రక్ ప్రొడక్షన్ ప్లాన్స్

By Ravi

దేశీయ ప్యాసింజర్ కార్ల దిగ్గజం మారుతి సుజుకి ఇండియా తమ మాతృ సంస్థ జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ సహకారంతో భారత మార్కెట్ కోసం తేలిక పాటి వాణిజ్య వాహనాలను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసినదే.

ప్రస్తుతం భారత్‌లో లైట్ కమర్షియల్ వెహికల్స్ (ఎల్‌సివి) సెగ్మెంట్లో అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో, ఈ అవకాశాలను క్యాష్ చేసుకొని, పోటీదారులకు గట్టి పోటీనిచ్చేలా మారుతి సుజుకి ఓ సరికొత్త ఎల్‌సివి అభివృద్ధి చేస్తోంది.

గతంలో సుజుకి మోటార్స్ నుంచి అత్యంత పాపులర్ అయిన క్యారీ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, కంపెనీ ఇందులో ఓ మినీ ట్రక్కును అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం కంపెనీ ఓ సరికొత్త 800సీసీ డీజిల్ ఇంజన్‌ను తయారు చేస్తోంది.

Maruti Suzuki Mini Truck Production Plans

సుజుకి సహకారంతో మారుతి ఈ కొత్త 800సీసీ డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేసింది. భారత్‌లోని మారుతి సుజుకి గుర్గావ్ ప్లాంటులో ఈ ఇంజన్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ప్రారంభంలో సాలీనా లక్షల ఎల్‌సివిలను విక్రయించాలని సుజుకి లక్ష్యంగా పెట్టుకుంది.

మారుతి సుజుకి నుంచి రానున్న మినీ ట్రక్కు ధర రూ.4 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లో టాటా, మహీంద్రా, అశోక్‌లేలాండ్ కంపెనీలు విక్రయిస్తున్న ఎల్‌సివిలతో పోటీపడే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, March 3, 2014, 12:23 [IST]
English summary
Suzuki Motors is planning to manufacture a light commercial vehicle in India. The Japanese manufacturer plans to offer the mini-trucks from the following year, in a bid to capitalise over the developing segment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+