భారతదేశపు రోడ్డు ప్రమాదాలలో నెంబర్ వన్ తమిళనాడు!

By Ravi

భారతదేశంలో కెల్లా అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాలలో తమిళనాడు మొట్టమొదటి స్థానంలో ఉంది. జాతీయ నేరాల నమోదు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2013లో మొత్తం 4,00,514 మంది ప్రజలు వివిధ ప్రమాదాల కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది కేవలం అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చని అంచనా. 2012తో పోల్చుకుంటే 2013లో ప్రమాదవశాత్తు మరణించిన వారి సంఖ్య దాదాపు 1.4 శాతం పెరిగింది.

దేశవ్యాప్తంగా వివిధ ప్రమాదాల బారినపడి మరణించిన వారికంటే, రోడ్డు ప్రమాదాల వలన మరణిస్తున్న వారి శాతమే అధికంగా ఉంది. రోడ్డు ప్రమాదాల వలన మరిణించే వారు 34.3 శాతంగా ఉంటే, హఠాత్తుగా మరణించే వారు 7.8 శాతంగాను, నీటమునిగి మరణించిన వారు 7.5 శాతం గాను, విషం వలన మరణించిన వారు 7.3 శాతం గాను, రైలు ప్రమాదాల వలన మరణించిన వారు 7.2 శాతం గాను మరియు అగ్నిప్రమాదాల వలన మరణించిన వారు 5.5 శాతంగా నమోదైనట్లు ఎన్‌సిఆర్‌బి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Tamil Nadu Tops In Road Accidents

చివరి విభాగంలో, మొత్తం 65.7 శాతం మంది మహిళలు ప్రమాదాల బారినపడి మృత్యువాత పడుతుంటే, కేవలం 34.3 శాతం మంది పురుషులు మాత్రమే మృత్యువాత పడుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే, ప్రతి 1000 వాహనాలకు గాను మరణాల రేటు 2009లో 1.4గా ఉంటే అది 2013లో 0.9కి తగ్గింది. కానీ ఈ రేటు బీహార్, సిక్కిం (1.6) ఎక్కువగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ (1.5) ఉంది. రోడ్డు ప్రమాదాల కారణంగా 2012లో 1,39,091 మంది చనిపోగా 2013లో 1,37,423 మంది చనిపోయారు.

అంటే, 2012తో పోల్చుకుంటే 2013లో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించి వారి సంఖ్య 1.2 శాతం తక్కువగా ఉందన్నమాట. ఈ సమయంలో తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా సంభవించిన రోడ్డు ప్రమాదాలలో తమిళనాడు 15 శాతం రోడ్డు ప్రమాదుల (66,238 మంది చనిపోయారు) మొట్టమొదటి స్థానంలో ఉంది. కారణం ఏదేమైనప్పటికీ, దేశవ్యాప్తంగా వివిధ ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది.

ఫొటో మూలం: Flickr

More from DriveSpark

Article Published On: Tuesday, July 1, 2014, 15:27 [IST]
English summary
According to the latest data released by National Crime Records Bureau (NCRB), road accidents continue to be the major cause of unnatural accidental deaths recording 34.3% of all deaths. Tamil Nadu has reported the maximum number of road accidents (66,238) accounting for 15% of such accidents in the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+