టాటా ఇండికా ఈవి2 రీప్లేస్‌మెంట్ మోడల్ వస్తోంది!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న టాటా ఇండికా ఈవి2 మోడల్ త్వరలోనే మార్కెట్ నుంచి తొలగిపోనుంది. టాటా ఇండికా ఈవి2 హ్యాచ్‌బ్యాక్ స్థానాన్ని భర్తీ చేస్తూ, ఓ అధునాత మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
టాటా మోటార్స్ తమ ఎక్స్0 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఇండికా ఈవి2 రీప్లేస్‌మెంట్ మోడల్‌ను అభివృద్ధి చేయనుంది. విస్టా హ్యాచ్‌బ్యాక్‌ను రీప్లేస్ చేసేందుకు బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేసినట్లుగా, ఇండికా ఈవి2 విషయంలో కూడా కంపెనీ ఓ కొత్త మోడల్‌ను తయారు చేయనుంది.
టాటా ఎక్స్0 (X0) ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ అభివృద్ధి చేయనున్న ఈ కొత్త కారును గుజరాత్‌లోని టాటా మోటార్స్ యొక్క సనంద్ ప్లాంట్‌లో (ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో టాటా నానో కారు మాత్రమే తయారవుతోంది) ఉత్పత్తి చేయనున్నారు.

నెలకు 20,000 యూనిట్ల టాటా నానో కార్లను తయారు చేయగలిగిన సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం సగటున 1000-2000 యూనిట్ల నానో కార్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఫలితంగా ఈ ప్లాంటు నిర్వహణ అధికమైన, కంపెనీపై అధనపు ఆర్థిక భారం పడుతోంది.
ఈ పరిస్థితుల్లో సనంద్ ప్లాంట్‌లో టాటా ఓ కొత్త ఎంట్రీ లెవల్ కారును తయారు చేయటం ద్వారా నష్టాలను కొంతైనా భర్తీ చేసుకోవాలని యోచిస్తోంది. 2015 నాటికి మార్కెట్లోకి రానున్న ఈ కారును రూ.3-4 లక్షల రేంజ్‌లో అందించాలని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications