బజాజ్ ఆర్ఈ60తో పోటీ పడనున్న టాటా ఐరిస్

By Ravi

క్వాడ్రిసైకిల్స్‌ (నాలుగు చక్రాల ప్యాసింజర్ కమర్షియల్ వెహికల్)కు భారత సర్కారు గ్రీన్ సిగ్నల్ ప్రకటించడంతో ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించిందేంకు అనేక కంపెనీలు సిద్ధమవుతున్నాయి. బజాజ్ ఆటో ఇప్పటికే తమ ఆర్ఈ60తో సిద్ధంగా ఉండగా, తాజాగా ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు టాటా మోటార్స్ కూడా ప్రణాళికలు రచిస్తోంది.

గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో బజాజ్ ఆటో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్‌ను ప్రదర్శించిన సంగతి తెలిసినదే. ఈ వాహనాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆమోదం తెలిపిన తక్షణమే వీటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు బజాజ్ ఆటో సిద్ధంగా ఉంది. ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న మూడు ఆటో రిక్షాలకు ప్రత్యామ్నాయంగా ఈ క్వాడ్రిసైకిళ్లను ప్రవేశపెట్టనున్నారు.


ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా తమ ఐరిస్ కాంపాక్ట్ ప్యాసింజర్ కమర్షియల్ వ్యాన్ ప్లాట్‌ఫామ్‌పై ఓ క్వాడ్రిసైకిల్‌ను తయారు చేసి, బజాజ్ ఆర్ఈ60కి పోటీగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. టాటా ఐరిస్ ఇప్పటికే దేశంలోని అనేక గ్రామాల్లో మంచి పాపులారిటీని కలిగి ఉంది, ఇది సిఎన్‌జి కిట్‌తో కూడా లభిస్తోంది.

అయితే, ఈ రెండు మోడళ్లకు భారీ వ్యత్యాసాలున్నాయి. బజాజ్ ఆర్ఈ60 కేవలం 400 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంటే, టాటా ఐరిస్ 680 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఆర్ఈ60లో 216సీసీ ఇంజన్‌ను ఉపయోగించగా, ఐరిస్‌లో 611సీసీ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

Bajaj RE60

బజాజ్ ఆర్ఈ60 2+2 లేదా 1+3 సీటింగ్ కెపాసిటీతో లభ్యం కానుంది. అలాగే టాటా ఐరిస్ 5-సీటర్‌గా కానీ లేదా మరింత విశాలవంతమైన 3 సీటర్‌గా కానీ లభ్యం కానుంది. ధర విషయంలో కూడా ఈ రెండు మోడళ్ల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. బజాజ్ ప్రస్తుతం విక్రయిస్తున్న రూ.1.42 లక్షల ధర కలిగిన త్రిచక్ర వాహనాల కన్నా ఆర్ఈ60 ధర కొంచెం ఎక్కువగా ఉండనుంది.

అలాగే టాటా మోటార్స్ నుంచి లభిస్తున్న ఈ ఐరిస్ ధర సుమారు రూ.2 లక్షలకు పైగా ఉంటోంది. కానీ సేఫ్టీ విషయంలో ఆర్ఈ60 కన్నా టాటా ఐరిస్ కొంచెం బెటర్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, April 21, 2014, 17:15 [IST]
English summary
Bajaj had showcased their production ready four-wheeler RE60 at the Delhi Auto Expo in 2014. Tata Motors will now join the competition with their Iris compact van. This will be considered as a replacement to the auto-rickshaws that we are currently used to. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+