టాటా మోటార్స్ బస్సుల కోసం సర్కారు నుంచి భారీ ఆర్డర్

By Ravi

ప్రముఖ దేశీయ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్, జవహర్‌‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జెఎన్ఎన్‌యూఆర్ఎమ్) - 2 స్కీమ్ క్రింద భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది.

ఈ స్కీమ్‌లో భాగంగా టాటా మోటార్స్, కెఎస్ఆర్టీసీ (కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్)కి 487 అర్బన్ బస్సులను మరియు హెచ్ఆర్టీసీ (హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్)కి 780 అర్బన్ బస్సులను సరఫరా చేయనుంది.

జెఎన్ఎన్‌యూఆర్ఎమ్ - 2 స్కీమ్ క్రింద టాటా మోటార్స్ మొత్తం 2700 అర్బన్ బస్సులను సరఫరా చేయాల్సి ఉంది. ఇందులో భాగంగానే, కర్ణాటకకు 487 బస్సులు, హిమాచల్‌కు 780 బస్సులు సరఫరా చేయనున్నారు.

Tata Urban Bus

టాటా మోటార్స్ అర్బన్ బస్సులు సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉండి, ప్రయాణీకులకు భద్రత, సౌకర్యం మరియు సౌలభ్యాన్ని ఆఫర్ చేసేలా డిజైన్ చేయబడి ఉంటాయి. ఇవి రాష్ట్ర రవాణా సంస్థలకు ఉత్తమ నిర్వహణ సామర్థ్యాన్ని చేకూర్చేలా కూడా ఉంటాయి.

ఈ బస్సులలో సిసిటి కెమెరాలు ఫిక్స్ చేయబడి ఉంటాయి. ఇవి బస్సులోని ప్రతి కదలికను రికార్డ్ చేస్తూ ఉంటాయి. బస్సులో ప్రయాణీకులు సులుగా తిరగాడేందుకు వీలుగా విశాలమైన స్థలం మరియు సులువుగా బస్సు ఎక్కడానికి, దిగడానికి వీలుగా తక్కువ ఎత్తులో డిజైన్ చేయబడిన డోర్లు ఉంటాయి.

టాటా అర్బన్ బస్సులలో ఐటిఎస్ (ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్) టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ వలన ఎలక్ట్రానిక్ డెస్టినేషన్ డిస్‌ప్లే బోర్డుల ద్వారా జిపిఎస్ సాయంతో బస్సు ఏ ప్రాంతంలో ఉంది, సంబంధిత స్టాప్‌కు రావటానికి ఎంత సమయం పడుతుంది, బస్సులో రూట్ అనౌన్స్‌మెంట్ మొదలైన పబ్లిక్ ఇన్ఫర్మేషన్‌ను తెలుసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 2, 2014, 17:07 [IST]
English summary
Tata Motors today announced that it had received an order from KSRTC (Karnataka State Road Transport Corporation) to supply 487 nos. and another for 780 nos. from HRTC (Himachal Road Transport Corporation) for Tata Marcopolo built buses as per “Urban Bus Specifications” under JNNURM – II scheme.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+