హోటల్‌లో క్రింద పడి టాటా మోటార్స్ ఎండి కార్ల్ స్లిమ్ మృతి

By Ravi

టాటా మోటార్స్‌కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యావహరిస్తున్న కార్ల్ స్లిమ్ (Karl Slym) ఆదివారం బ్యాంకాక్‌లో దుర్మరణం చెందారు. బ్యాంకాక్‌లో తాను బస చేసిన ఓ హోటల్ భవనం నుంచి జారిపడి ఆయన చనిపోయారు.

థాయిలాండ్‌లోని టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా మోటార్స్ థాయిలాండ్ లిమిటెడ్ బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు ఆయన బ్యాంకాక్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే ఓ హోటల్‌లో బస చేసిన ఆయన అందులోని 22వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందినట్లు సంస్థ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నేడు (సోమవారం) పోస్టుమార్టమ్ జరగనుందని వివరించారు.

అక్టోబర్ 2012లో కార్ల్ స్లిమ్ టాటా మోటార్స్‌లో చేరారు. కాగా, 51 ఏళ్ల వయస్సు కలిగిన కార్ల్ స్లిమ్ ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర మందగమనంలో సాగుతున్న సమయంలో టాటా మోటార్స్ ఎండిగా బాధ్యతలు స్వీకరించారు. దేశీయ మార్కెట్‌లో తమ సంస్థ నిలదొక్కుకోవడానికి ఆయన ఎంతగానో కృషి చేశారని టాటా మోటార్స్ కొనియాడింది.

Karl Slym

టాటా గ్రూప్ ప్రస్తుత చైర్మన్ సైరస్ పి మిస్ర్తి, కార్ల్ స్లిమ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. స్లిమ్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంస్థాగత వ్యయాన్ని తగ్గించడంలో భాగంగా గతవారం ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని కూడా ఆయన ప్రకటించినట్లు గుర్తుచేశారు. భారతీయ ఆటోమొబైల్ తయారీరంగ సమాజం (సియామ్) అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ మాట్లాడుతూ ఓ మంచి మిత్రుడిని కోల్పోయామని అన్నారు.

కార్ల్ స్లిమ్ గతంలో అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్‌ (జిఎమ్)కు చెందిన భారత యూనిట్‌కు మాజీ ఛీఫ్‌గా మరియు చైనా, జనరల్ మోటార్స్‌ల జాయింట్ వెంచర్ 'ఎస్‌జిఎమ్‌డబ్ల్యూ (ఎస్ఏఐసి-జిఎమ్-వులింగ్) మోటార్స్' కంపెనీకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. కార్ల్ స్లిమ్ జనరల్ మోటార్స్‌లో దాదాపు 17 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది.

కార్ల్ స్లిమ్ ప్రస్తుతం ఇండియాలోని టాటా మోటార్స్ కార్యకలాపాలతో పాటుగా దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, స్పెయిన్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, January 27, 2014, 10:13 [IST]
English summary
Karl Slym, 51, MD Tata Motors, died in Bangkok after a fall on Sunday. Slym, was in Thailand to attend a meeting of the board of directors of Tata's subsidiary in the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+