టాటా మోటార్స్ నుంచి కొత్త టర్బో పెట్రోల్ ఇంజన్; డిటేల్స్

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ వచ్చే నెలలో జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో సరికొత్త అప్‌డేటెడ్ మోడళ్లను విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. కంపెనీ ఇప్పటికే ఫాల్కన్ అనే పేరిట నెక్స్ట్ జనరేషన్ విస్టా, మాంజా మోడళ్లను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో, టాటా ఫాల్కన్ మోడళ్లలో ఉపయగించనున్న సరికొత్త ఇంజన్‌కు సంబంధించిన సమాచారం వెల్లడైంది.

టాటా మోటార్స్ స్వతహాగా అభివృద్ధి చేసిన ఓ కొత్త 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ మెరుగైన ఫ్యూయెల్ ఎకానమీ (మైలేజ్)ని ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఇంజన్ కేవలం 80 బిహెచ్‌పిల శక్తిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ ఇంజన్ పెర్ఫామెన్స్ తక్కువే అయినప్పటికీ, మైలేజ్‌కు ప్రాధాన్యత ఇస్తూ దీనిని తయారు చేశారని తెలుస్తోంది.

Tata Motors

ఏదేమైనప్పటికీ, ఈ కొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ టాటా మోటార్స్ ఇదివరకటి పెట్రోల్ ఇంజన్‌ల కన్నా మెరుగైన పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేయనుందని, ఇది మెరుగైన బ్యాలెన్స్, స్టిఫ్‌నెస్ మరియు లోవర్ వెయిట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ ఇంజన్‌‌లో సిలిండర్‌కు రెండు వాల్వ్‌ల చొప్పున నిర్మాణం కలిగి ఉంటుంది. ఇందులో ఫోర్ వాల్వ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కంపెనీ యొక్క టిఏ65 ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది, గేర్ షిఫ్ట్ మరింత స్మూత్‌గా ఉంచేందుకు ఇంప్రూవ్‌మెంట్స్ చేశారు. టాటా అభివృద్ధి చేస్తున్న సరికొత్త ఇంజన్లలో ఇది మొట్టమొదటిది. భవిష్యత్తులో డైరెక్ట్ ఫ్యూయెల్ ఇంజక్షన్ సిస్టమ్‌తో కలిగిన పెద్ద సీసీ కలిగిన ఇంజన్‌లను తయారు చేసే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 15, 2014, 12:02 [IST]
English summary
By now it is well known that Tata Motors will be launching two new updated models at the Auto Expo 2014 next month. Known only by their codename ‘Falcon' these two new vehicles are the next generation Vista and Manza. The new vehicles will also sport a brand new engine, which Tata Motors has developed inhouse. A 1.2 liter turbocharged petrol unit. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+