సెప్టెంబర్‌లో టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ విడుదల
కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో అత్యంత సరసమైన ధరకే (రూ.4.64 లక్షల ప్రారంభ ధర, బేస్ పెట్రోల్ వేరియంట్, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) టాటా జెస్ట్ కారును విడుదల చేసిన టాటా మోటార్స్, దేశీయ విపణిలో తమ తర్వాతి ఉత్పత్తిని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో కంపెనీ పేర్కొన్నట్లుగానే ఆగస్ట్ నెలలో జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను విడుదల చేయగా, సెప్టెంబర్ నెలలో బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనుంది.
ఇది కూడా చదవండి: టాటా జెస్ట్ విడుదల; ధరలు
టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ, ఇది సెప్టెంబర్ మొదటి పక్షంలోనే విడుదల కావచ్చని సమాచారం. టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో ఉపయోగించిన ఇంజన్లనే ఈ కొత్త టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించనున్నారు. ఈ రెండు మోడళ్లు ముందు వైపు నుంచి చూడటానికి ఒకేలా ఉంటాయి, ఇంటీరియర్స్ కూడా ఇంచు మించు ఒకే మాదిరిగా ఉంటాయి.

పెట్రోల్ వెర్షన్ టాటా బోల్ట్ కారులో కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ లేదా ఏఎమ్‌టి గేర్‌బాక్స్ లభ్యత గురించి సమాచారం అందుబాటులో లేదు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ మార్కెట్లో హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ధరలు
డీజిల్ వెర్షన్ టాటా బోల్ట్ కారులో కూడా ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, జెస్ట్ మాదిరిగా డీజిల్ వెర్షన్ బోల్ట్ టాప్-ఎండ్ వేరియంట్‌లో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)తో లభిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

టాటా 'హ్యుమినిటీ' లైన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, కొత్త బంపర్స్, కొత్త కలర్ ఆప్షన్స్‌తో పాటుగా ఇందులో 5 ఇంచ్ టచ్‍స్క్రీన్‌తో కూడిన హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ రికగ్నైజేషన్ అండ్ టెక్స్ట్ టూ స్పీచ్ సిస్టమ్, ఫోన్ ఆధారిగా నావిగేషన్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి పలు ప్రీమియం ఫీచర్లు లభ్యం కానున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








