ఉమెన్స్ డే స్పెషల్: భారతీయ మహిళా బ్యాంకుతో టాటా డీల్

By Ravi

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారతీయ మహిళా బ్యాంకు (బిఎమ్‌బి)తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, టాటా మోటార్స్ అందిస్తున్న ప్యాసిజర్ వాహనాలను కొనుగోలు చేసేందుకు గాను మహిళలకు భారతీయ మహిళా బ్యాంక్ రుణ సదుపాయాన్ని కల్పించనుంది.

భారతదేశంలో ప్రత్యేకించి మహిళల కోసం ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోవటం ఇదే ప్రప్రథమమని టాటా మోటార్స్ పేర్కొంది. కేవలం 10.5 శాతం వడ్డీ రేటుకే వాహన రుణాలు అందించేలా భారతీయ మహిళా బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నామని, సదరు బ్యాంక్ ఏడేళ్ల కాల వ్యవధి వరకు రుణాలను మంజూరు చేస్తుందని కంపెనీ వివరించింది.

Tata Motors Partners With Bharatiya Mahila Bank

టాటా మోటార్స్ - భారతీయ మహిళా బ్యాంక్ ఒప్పందం ద్వారా సంస్థ వినియోగదారులలో 11 శాతంగా ఉన్న మహిళా వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ పరిణామంతో ప్యాసింజర్‌ కార్ల విక్రయంలో నూతన లక్ష్యాలను చేరుకోగలని కంపెనీ యోచిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న బిఎమ్‌బి బ్యాంకులలో ద్వారా మహిళలు ఈ రుణాలను పొందవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, March 8, 2014, 12:41 [IST]
English summary
On the occasion of International Women’s Day, Tata Motors will enter into an understanding with Bharatiya Mahila Bank, for financing its passenger vehicle customers. Bharatiya Mahila Bank Ltd. (BMB), is the first of its kind in India, formed with a vision to enable economic empowerment for women.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+