ఆసియా, ఆఫ్రికా మార్కెట్లకు టాటా జెస్ట్ ఎగుమతి

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే విపణిలో విడుదల చేసిన తమ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను భారత మార్కెట్లోనే కాకుండా ఆసియా, ఆఫ్రికా మార్కెట్లకు కూడా ఎగుమతి చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి తమ దృష్టంతా భారత మార్కెట్‌పైనే కేంద్రీకరించామని, అయితే ఈ మోడళ్లను ఆసియా, ఆఫ్రికా మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నామని, టాటా మోటార్స్ వెహికల్ లైన్ డైరెక్టర్ (ప్యాసింజర్ వెహికల్స్) జాన్ ఓ కూనర్ తెలిపారు.

టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను కేరల మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. హ్యాచ్‌బ్యాక్ నుంచి సెడాన్‌కు మారాలనుకునే యువ ప్రొఫెషనల్స్‌ను టార్గెట్‌గా చేసుకొని టాటా మోటార్స్ తమ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను ప్రవేశపెట్టింది. తాము విడుదల చేసిన ఈ కొత్త వాహనం పట్ల కంపెనీ చాలా ఆశాభావంతో ఉందని టాటా మోటార్స్ నేషనల్ సేల్స్ హెడ్ - సౌత్ అండ్ ఈస్ట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్) అశేష్ ధార్ అన్నారు.

తమ రెండు ప్లాంట్లలో తగినంత ఉత్పత్తి సామర్థ్యం ఉందని, అవసరమైన ఈ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఈ కొత్త కారుకు అనూహ్య స్పందన లభించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tata Zest

టాటా జెస్ట్ విషయానికి వస్తే.. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెర లేపుతూ టాటా మోటార్స్ కేవలం రూ.4.64 లక్షల ప్రారంభ ధరకే (బేస్ పెట్రోల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఈ మోడల్‌ను విడుదల చేసింది. ఇది మొత్తం 9 వేరియంట్లలో (4 పెట్రోల్, 5 డీజిల్) లభిస్తుంది.

పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇందులో కంప్లీట్ ఆటోమేటిక్ కానీ లేదా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) కానీ అందుబాటులో లేదు.

కాకాగా.. డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. డీజిల్ వెర్షన్ టాప్-ఎండ్ వేరియంట్ మాత్రం ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)తో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 14, 2014, 11:52 [IST]
English summary
Tata Motors has said it has plans to export its new car 'Zest' to Asian and African markets. There are plans to export to Asian and African markets," but present focus would be on the domestic market, John O' Cooner, Vehicle Line Director (Passenger Vehicles) of Tata Motors, told reporters.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+