పవర్ స్టీరింగ్ టాటా నానో తర్వాత, ఆటోమేటిక్ నానో

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారుగా ముద్ర వేసుకున్న టాటా నానో, ఇప్పుడు తనపై పడిన ముద్రను కొద్ది కొద్దిగా చెరిపేసుకుంటోంది. రెండు రోజుల క్రితం పవర్ స్టీరింగ్‌తో టాటా నానో ట్విస్ట్ (Tata Nano Twist)ను విడుదల చేసిన టాటా మోటార్స్, ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో కూడిన మరో టాటా నానో కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఆటోకార్ ప్రొఫెషనల్ పేర్కొన్న సమాచరం ప్రకారం, మారుతి సుజుకి త్వరలో విడుదల చేయనున్న సెలెరియో మాదిరిగానే టాటా మోటార్స్ కూడా క్లచ్‌ రహిత (క్లచ్‌లెస్) నానో కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త టాటా నానో కారులో సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) ట్రాన్సిమిషన్‌ను కానీ లేదా తక్కువ ధర కలిగిన ఏఎమ్‌టి (ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)ను కానీ బిగించే ఆస్కారం ఉంది.


'ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్' (ఏఎమ్‌టి) టెక్నాలజీ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఇదొక క్లచ్ లేని మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్. అంటే, ఏఎమ్‌టి ట్రాన్సిమిషన్ కలిగిన నానో కారులో డ్రైవర్ క్లచ్ నొక్కాల్సిన అవసరం లేకుండా గేరును మ్యాన్యువల్‌గా మార్చాల్సి ఉంటుంది. ఈ టెక్నాలజీ వలన రెగ్యులర్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లోని సౌకర్యం మరియు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ యొక్క మైలేజ్ రెండూ లభిస్తాయి.

ఇకపోతే, ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ సిస్టమ్ (ఈపిఏఎస్)తో కూడిన కొత్త 'టాటా నానో ట్విస్ట్' (Tata Nano Twist) విషయానికి వస్తే.. ఇందులో ఉపయోగించిన పవర్ స్టీరింగ్‌ను బోష్ సహకారంతో జర్మన్ సంస్థ జెడ్ఎఫ్ ప్రత్యేకంగా నానో కారు కోసం తయారు చేసింది. ఈ పవర్ స్టీరింగ్‌లో బ్రష్‌లెస్ మోటార్‌ను ఉపయోగించారు, ఇది యాక్టివ్ రిటర్న్ అనే ఫీచర్‌తో లభిస్తుంది. ఈ యాక్టివ్ రిటర్న్ అనే ఫీచర్ వలన కారును టర్న్ చేసిన తర్వాత స్టీరింగ్ ఆటోమేటిక్‌గా సెంటర్ పొజిషన్‌కు వస్తుంది. ఓ ఎంట్రీ లెవల్ కారులో ఈ ఫీచర్‌ను ఆఫర్ చేయటం ఇదే మొట్టమొదటిసారి.

New Tata Nano

నానో ట్విస్ట్‌లో ఫ్రంట్ పవర్ విండోస్, రిమోట్ కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి. ఇది కొత్త బాడీ కలర్ (డామ్సన్ పర్పల్)లో లభిస్తుంది. దీని ఇంటీరియర్స్‌లో కొద్దిపాటి మార్పులు ఉన్నాయి. ఇందులో ఎల్ఈడి ఫ్యూయెల్ అండ్ టెంపరేచర్ ఇండికేటర్స్, యావరేజ్ ఫ్యూయెల్ ఎకానమీ, డిస్టన్స్ టూ ఎంప్టీ ఇండికేటర్స్ మరియు డిజిటల్ క్లాక్‌తో కూడిన సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను జోడించారు.

కొత్త టాటా నానో ట్విస్ట్ కేవలం ఎక్స్‌టి వేరియంట్లో మాత్రమే లభిస్తుంది (రెగ్యులర్ ఎల్ఎక్స్ వేరియంట్ మాదిరిగానే). భారత మార్కెట్లో దీని ధర రూ.2.36 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. పవర్ స్టీరింగ్‌తో కూడిన టాటా నానో ట్విస్ట్ ఎక్స్‌టి వేరియంట్ ధర పవర్ స్టీరింగ్ లేని రెగ్యులర్ టాటా నానో ఎల్ఎక్స్ వేరియంట్ కన్నా రూ.13,000 అధికం. అంటే, పవర్ స్టీరింగ్ కోసం సుమారు 13,000 అధికంగా చెల్లించాలన్నమాట.

More from DriveSpark

Article Published On: Wednesday, January 15, 2014, 18:24 [IST]
English summary
According to a report by Autocar Professional, Tata Motors are working on a automatic transmission for the Nano. Stay tuned to drivespark for more updates on the Tata Nano Automatic.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+