డొక్కు కారు అమ్మిన టాటా మోటార్స్; రూ.1.25 లక్షల జరిమానా

By Ravi

కస్టమర్‌కు ఓ డొక్కు కారును అంటగట్టినందుకు, సదరు కస్టమర్‌కు రూ.1.25 లక్షలను చెల్లించాల్సిందిగా న్యూఢిల్లీ కన్జ్యూమర్ ఫోరమ్ పేర్కొంది. ఢిల్లీకి చెందిన ఖలీద్ హష్మి అనే కస్టమర్ ఓ టాటా కారును కొనుగోలు చేశాడు. అయితే, కారు కొన్న మొదటి సంవత్సరంలోనే అది లెక్కలేనన్ని సార్లు మరమ్మత్తులకు గరికావడంతో అతను కన్జ్యూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించాడు.

ఈ విషయాన్ని పరిశీలించిన న్యూఢిల్లీ డిస్ట్రిక్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రసల్ ఫోరమ్, కారు తయారీలో నాణ్యత పాటించకపోవటం, ఫలితంగా సదరు కస్టమర్ కారును ఉపయోగించడానికి కూడా వీలులేని విధంగా ఉండటంతో, ఖలీద్ హష్మికి పరిహారంగా ఒక లక్ష రూపాయాలను మరియు లిటిగేషన్ ఖర్చుల క్రింద పాతికేవేలను (మొత్తం రూ.1.25 లక్షల) చెల్లించాల్సిందిగా సూచించింది.

Tata Motors Selling Defective Cars

ఆ కారు విషయంలో జాబ్ కార్డులు, రిసీప్టులను పరిశీలించిన పిమ్మట్ కారులోని ఇంజన్ మరియు ఇతర భాగాలను 2005లోనే మార్చాల్సి ఉన్నప్పటికీ (కారు కొన్న మొదటి సంవత్సరం) అలా చేయలేదని ఫోరమ్ గుర్తించింది. సి.కె. చతుర్వేదితో కూడిన ధర్మాసనం ఈ మేరకు సదరు కస్టమర్‌కు రూ.1.25 లక్షల పరిహారాన్ని చెల్లించాల్సిందిగా టాటా మోటార్స్‌ను ఆదేశించింది.

కారు కొనుగోలు చేసిన దాదాపు 8 ఏళ్లు పూర్తవుతున్న కారును ఇంతవరకు రీప్లేస్ చేయలేదు. ఖలీద్ హష్మి జులై 2004లో కొత్త టాటా కారును కొనుగోలు చేశాడు. కొన్న రోజు నుంచే కారులో అనేక సమస్యలు తలెత్తాయి. అయితే, టాటా మోటార్స్ మాత్రం ఖలీద్ పిటిషన్‌ను ఖాతరు చేయలేదు. కొత్త కారులో అన్ని సమస్యలు ఎలా వస్తాయని కంపెనీ పేర్కొంది. ఏదేమైనప్పటికీ, చివరకు కన్జ్యూమర్ ఫోరమ్ కస్టమర్‌కు సానుకూలంగా తీర్పునిచ్చింది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 8, 2014, 12:31 [IST]
English summary
A New Delhi consumer forum has directed Tata Motors Ltd to pay compensation of Rs. 1.25 Lakhs. As a customers car developed numerous defects within the first year of purchase. The New Delhi District Consumer Disputes Redressal Forum found that the victim could not use the new car after purchase, due to imperfections and lack of quality check done by the car company. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+