సెప్టెంబర్‌లో జాగ్వార్ ఎక్స్ఈ గ్లోబల్ డెబ్యూ

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ తమ సరికొత్త జాగ్వార్ ఎక్స్ఈ రానున్న సెప్టెంబర్ నెలలో ప్రపంచానికి పరిచయం చేయనుంది. జాగ్వార్ అభివృద్ధి చేస్తున్న ఎక్స్ఈ మోడల్‌కు వరల్డ్ ప్రీమియర్ డేట్‌ను సెప్టెంబర్ 8, 2014న ఖరారు చేశారు. లండన్‌లో నిర్వహించబోయే ఓ ప్రత్యేక కార్యక్రమంలో జాగ్వార్ ఎక్స్ఈ కారును ఆవిష్కరించనున్నారు.

జాగ్వార్ ఎక్స్ఈ కారును అల్యూమినియం ఇంటెన్సివ్ లైట్‌వెయిట్ కన్స్‌ట్రక్షన్‌తో తయారు చేశారు. కొత్త ఎక్స్ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ధృడమైన అల్యూమినియంను తయారు చేశారు. ఈ అల్యూమినియం గ్రేడ్‌ను ఆర్‌సి 5754 అని పిలుస్తారు. ప్రస్తుతానికి ఈ మెటీరియల్‌ను కేవలం ఎక్స్ఈ కారులోనే ఉపయోగించనున్నారు.

Jaguar XE Globally In September

ఈ కొత్త అల్యూమినియం కన్స్‌ట్రక్షన్ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2013లో ప్రదర్శించారు. 2015 నాటికి జాగ్వార్ ఎక్స్ఈ ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఈ సెగ్మెంట్లో అల్యూమినియం మోనోకాక్ ఛాస్సిస్ కలిగిన ఏకైక వాహనంగా జాగ్వార్ ఎక్స్ఈ రికార్డ్ సృష్టించనుంది. ఇందులో ఓ ప్రత్యేక టెక్నాలజీ ప్యాకేజ్‌ను కూడా ఆఫర్ చేయనున్నారు.

తమ కొత్త స్పోర్ట్స్ సెలూన్ ఓ నిజమైన డ్రైవర్స్ కార్ అని జాగ్వార్ వివరించింది. జాగ్వార్ ఎక్స్ఈతో పాటుగా కంపెనీ ఓ సరికొత్త సిస్టమ్‌ను కూడా పరిచయం చేయనుంది. ఇందులో ఫ్రంట్ సస్పెన్షన్‌ను తమ ఫేమస్ ఎఫ్-టైప్ నుంచి గ్రహించనున్నారు. ఇందులో ఓ సరికొత్త ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్‌ను కూడా పరిచయం చేయనున్నారు.


జాగ్వార్ ఈ కారులో సెగ్మెంట్లో కెల్లా మొట్టమొదటి సారిగా 'ఆల్ సర్ఫేస్ ప్రోగ్రామ్ కంట్రోల్' సిస్టమ్‌ను పరిచయం చేయనున్నారు. ప్రతి వాతావరణంలో మరియు ప్రతి టెర్రైన్‌పైనా వెనుక చక్రాల వద్ద ట్రాక్షన్ ఉండేలా ఈ సిస్టమ్ సహకరిస్తుంది. సఫిస్టికేటెడ్ ఛాస్సిస్, అల్యూమినియం ఇంటెన్సివ్ ఆర్కిటెక్చర్‌లను జాగ్వార్ ఎక్స్ఈ లగ్జరీ సెడాన్‌లో ఉపయోగించారు.

ఎక్స్ఈ ఆవిష్కరణతో పాటుగా జాగ్వార్ నాలు కొత్త టెక్నాలజీలను కూడా పరిచయం చేయనుంది. తమ డిజైన్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విధానాలకు ఈ కొత్త జాగ్వార్ ఎక్స్ఈ ప్రతీకగా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. సెప్టెంబర్‌లో నిర్వహించబోయే ఈ కార్యక్రమంలో, జాగ్వార్ తమ కొత్త అల్యూమినియం ఆర్కిటెక్చర్ మరియు కొత్తగా అభివృద్ధి చేసిన డ్రైవర్ ఫీచర్స్ గురించి జాగ్వార్ వివరించనుంది.

ఈ వీడియో చూశారా..
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/rMSL4WKT5Uc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Wednesday, July 30, 2014, 10:32 [IST]
English summary
Jaguar Land Rover brand is owned by Indian automobile giant Tata Motors. The British iconic brand had earlier announced the XE as its new premium sports sedan offering. The vehicle will be showcased globally at London on the eighth of September, 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+