జేఎల్ఆర్ హాలేవుడ్ ప్లాంట్ కోసం టాటా నుంచి 200 మిలియన్ పౌండ్ల పెట్టుబడులు
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ గడచిన ఐదేళ్ల క్రితం బ్రిటన్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) కంపెనీని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసినదే. దివాళా తీసే స్థితిలో ఉన్న జేఎల్ఆర్ కంపెనీ టాటా స్వాధీనం చేసుకొన్న తర్వాత చేపట్టిన అభవృద్ధి పనుల వలన తిరిగి జేఎల్ఆర్ పురోగతిని సాధించి, ప్రస్తుతం వృద్ధి బాటలో పయనిస్తోంది.
యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న తమ హాలేవుడ్ ప్లాంట్‌లో కొత్త మోడళ్లను తయారు చేయాలని జాగ్వార్ ల్యాండ్ రోవర్ నిర్ణయించింది. త్వరలోనే ఈ ప్లాంట్‌లో డిస్కవరీ స్పోర్ట్ మోడల్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఇందుకో టాటా మోటార్స్ సుమారు 200 మిలియన్ పౌండ్ల పెట్టుబడులను హాలేవుడ్ ప్లాంట్‌లో వెచ్చించనుంది.

ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో ల్యాండ్ రోవర్ నుంచి అత్యంత పాపులర్ అయిన రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీని ఉత్పత్తి చేస్తున్నారు. గడచిన నాలుగేళ్ల కాలంలో హాలేవుడ్ ప్లాంట్ కోసం మొత్తం 500 మిలియన్ పౌండ్ల పెట్టుబడులను వెచ్చించారు. అంతేకాకుండా, ఈ ప్లాంట్ కోసం కొత్త 250 మంది ఉద్యోగులను కూడా నియమించుకోనున్నారు.
ఈ ప్లాంట్‌లో కొత్తగా ఉత్పత్తి చేయనున్న డిస్కవరీ స్పోర్ట్ మోడల్, ప్రస్తుత డిస్కవరీ బ్రాండ్ నుంచే రానుంది. గడచిన న్యూయార్క్ ఆటో షోలో ఈ మోడల్‌ని కాన్సెప్ట్‌గా ప్రదర్శించారు. ఇది 2015 నాటికి అందుబాటులోకి వస్తుందని జాగ్వార్ ల్యాండ్ రోవర్ పేర్కొంది.


Click it and Unblock the Notifications








