పాకిస్థాన్ గ్రూప్ చేతిలో హ్యాకింగ్ గురైన టాటా మోటార్స్ వెబ్‌సైట్?
టాటా మోటార్స్ వెబ్‌సైట్‌ను పాకిస్థాన్ గ్రూప్ హ్యాక్ చేసిందా? అవుననే చెబుతున్నాయి లేటెస్ట్ రిపోర్ట్స్. ఇప్పటి వరకు ఫైనాన్స్ కంపెనీలు, సెక్యూరిటీ ఏజెన్సీలు మరియు ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన హ్యాకర్లు తాజాగా ఆటోమొబైల్ కంపెనీలు టార్గెట్ చేశాయి.
టాటా మోటార్స్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌ను 'పాకిస్థాన్ హాక్సోర్స్ క్రూ'గా చెప్పుకునే ఓ పాకిస్థానీ గ్రూప్ హ్యాచ్ చేసింది. అయితే, హ్యాకింగ్‌కు గురైంది టాటా మోటార్స్ యొక్క మెయిన్ సైట్ (www.tatamotors.com) కాదు. అదొక సబ్-డొమైన్ (connect.tatamotors.com).

ఆటో ఎక్స్‌పో 2014లో టాటా మోటార్స్ ప్రదర్శించిన ఉత్పత్తులకు సంబంధించిన సమారాన్ని అందించే connect.tatamotors.com సైట్‌ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఈ ఆర్టికల్ రాస్తున్న సమయంలో ఆ వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు "The site is currently not accessible." (ప్రస్తుతం ఈ సైట్‌ను యాక్సిస్ చేయటం సాధ్యం కాదు) అనే సందేశంతో కూడిన ఖాలీ పేజ్ ఓపెన్ అయ్యింది.
అయితే, అంతకు మునుపు ఈ డిఫేస్డ్ పేజీపై "India B Ready I Am Coming" (ఇండియా సిద్ధంగా ఉండు, నేను వస్తున్నా) అనే సందేశం కనిపించింది. ఆ తర్వాత "India B Ready I Am Coming " The hacker wrote on the defaced page.
"Pakistan Haxors Crew is here to remind you of your security... Our fight is not against any individual but the system as a whole.. Should you choose to ignore security, it will reincarnate as your worst nightmare ! We just defaced your website to give you a chance to put your hands on it before others come and destroy it!" అనే సందేశాన్ని ఆ సైట్‌లో ప్రచురించారు.

ఈ సందేశం సారాంశం ఏంటంటే, "మీ భద్రత గురించి గుర్తు చేసేందుకు పాకిస్థాన్ హాక్సోర్స్ క్రూ ఇక్కడుంది.. మా యుద్ధం ఏ వ్యక్తితోనో కాదు, వ్యవస్థపైనే మా పోరాటం.. భద్రత విషయాన్ని మీరు విస్మరిస్తే, తీరని సమస్యలు ఎదుర్కుంటారు. మీ వెబ్‌సైట్‌ను మేము కేవలం డిఫేస్ చేశాం, వేరేవాళ్లు వచ్చి దీనిని నాశనం చేయక మునుపే సరిచేసుకోండి" అని అర్థం.
ఈ అంశానికి సంబంధించి గూగుల్ సెర్చ్‌లో కూడా ఆర్టెడ్ సైట్ డిస్క్రిప్షన్‌తో కూడిన ఓ లింక్ కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ను ఈ ఫొటోలో చూడొచ్చు. కాగా.. ఈ సైట్ హ్యాకింగ్‌కు టాటా మోటార్స్ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవటం గమనార్హం.


Click it and Unblock the Notifications








