ఏటా రెండు కొత్త కార్లు విడుదల చేస్తాం: టాటా మోటార్స్
ప్యాసింజర్ కార్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కోలేక క్రమంగా మార్కెట్ వాటాను కోల్పోతున్న టాటా మోటార్స్, తమ పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు సరికొత్త ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ఇక నుంచి ప్రతి ఏటా రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చేందుకు వ్యూహ రచనలు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
కొత్త మోడళ్లను అందించలేకపోవడం వల్లే అమ్మకాల్లో వెనకబడ్డామని, ప్యాసింజర్ వాహన మార్కెట్లో కోల్పోయిన వాటా సంపాధించుకోవటమే తమ లక్ష్యమని టాటా మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) రంజిత్ యాదవ్ తెలిపారు. ఈ దిశలో భాగంగా ప్రతి ఏటా రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తామని ఆయన వివరించారు.

ఈ కొత్త ఉత్పత్తుల్లో భాగంగా, తాము ఇప్పటికే కొత్త హ్యాచ్‌బాక్ బోల్ట్‌ను మరియు కాంపాక్ట్ సెడాన్ జెస్ట్‌ను ఇటీవలే భారత మార్కెట్లో ఆవిష్కరించామని, ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి ఈ రెండు కొత్త మోడల్లు కస్టమర్లకు వాణిజ్య పరంగా అందుబాటులోకి వస్తాయని రంజిత్ తెలిపారు. కాగా.. తాము ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో ఆవిష్కరించిన కాన్సెప్ట్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ 'నెక్సన్'ను విడుదల చేయటానికి మాత్రం మరో రెండేళ్ల సమయం పడుతుందని ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications








