ఈబేలో టాటా సఫారీ స్టోర్మ్ మర్చండైస్ విక్రయం
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ కార్లకు సంబంధించిన వివిధ రకాల మర్చండైస్ (టీ షర్టులు, గిఫ్ట్ ఆర్టికల్స్, స్కేల్ మోడల్స్, ఇన్-కార్ యాక్ససరీస్ మొదలైనవి)లను విక్రయించేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్న సంగతి తెలిసినదే.
ఇప్పటికే టాటా నానో మర్చండైస్‌లను ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్ ఈబే లో విక్రయిస్తున్న టాటా మోటార్స్ తాజాగా తమ పాపులర్ టాటా సఫారీ స్టోర్మ్ మర్చండైస్‌లను కూడా ఈబే లో విక్రయిస్తోంది.

ఈబేలో కంపెనీ ఆఫర్ చేస్తున్న టాటా సఫారీ స్టోర్మ్ మర్చండైస్‌లో స్త్రీ, పురుషుల కోసం టీషర్టులతో పాటుగా అడ్వెంచర్ ట్రిప్‌లు చేసే వారి కోసం ట్రెక్కింగ్ బ్యాగ్, రెడ్ కలర్ 10 ఇన్ 1 స్విస్ నైఫ్, ఒరిజినల్ కంపాస్, టార్చ్ అండ్ సెల్స్, ట్రావెల్ క్లాక్‌లను విక్రయిస్తున్నారు.
వీటితో పాటుగా బ్లాక్ లెథర్ కీచైన్, బ్యాక్ సీట్ ఆర్గనైజర్, స్మాల్ టేబుల్ క్లాక్‌లను టాటా మోటార్స్ ఈబే ద్వారా విక్రయిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని మర్చండైస్‌లను టాటా మోటార్స్ ఈబే సైట్‌లో విక్రయించే అవకాశం ఉంది.
ఇకపోతే.. ఇప్పటికే విక్రయిస్తున్న టాటా నానో మర్చండైస్ విషయానికి వస్తే.. ఈబే ఆన్‌లైన్ స్టోర్‌లో టాటా నానో టీ షర్టులు, పెన్‌డ్రైవ్స్, కీచైన్స్, స్కేల్ మోడల్స్, వాచ్‌లు, కాఫీ మగ్గులు, యాంటీ స్కిడ్ మ్యాట్, స్క్వీజ్ స్ట్రెస్ రిలీవర్ మొదలైనవి విక్రయిస్తున్నారు.


Click it and Unblock the Notifications








