టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ వెల్లడి

By Ravi

ప్రముఖ దేశీయ వాణిజ్య వాహన దిగ్గజం టాటా మోటార్స్ భారత్‌కు ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను పరిచయం చేయనున్నట్లు గడచిన నెలలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. బుధవారం (జనవరి 22, 2013న) టాటా మోటార్స్ భారతదేశపు మొట్టమొదటి 'టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్'ను భారత్‌కు పరిచయం చేస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

మార్చ్ 23, 2014వ తేది నుంచి గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి)పై నిర్వహించనున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌‌ను ఎఫ్ఐఏ మరియు ఎఫ్ఎమ్ఎస్‌సిఐ పర్యవేక్షణలో నిర్వహించనున్నారు.


టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ కోసం టాటా మోటార్స్ ప్రత్యేకంగా 12 ప్రైమా బ్రాండ్ హెవీ ట్రక్కులను తయారు చేసింది. వీటిని ప్రత్యేకించి రేస్‌కు అనువుగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ 12 ట్రక్కులను ఆరు బృందాలకు కేటాయిస్తారు. సేఫ్టీ మరియు పెర్ఫామెన్స్ స్టాండర్డ్స్ విషయంలో బ్రిటీష్ ట్రక్ రేసింగ్ అసోసియేషన్ (బిటిఆర్ఏ) మార్గదర్శకాల ప్రకారం, ఎమ్ఎమ్ఎస్‌సిఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అంతర్జాతీయంగా నైపుణ్యం పొందిన డ్రైవర్లు ఈ పోటీలో పాల్గొననున్నారు.

టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌కు కమ్మిన్స్, వాబ్‌కో, జెకె టైర్స్, క్యాస్ట్రాల్, యాక్సెంచర్‌లు ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తుండగా, టాటా స్టీల్, సెట్‌కో ఆటోమోటివ్, ఆర్ఎస్‌బి గ్రూప్, టిఆర్‌డబ్ల్యూ స్టీరింగ్ సిస్టమ్ లిమిటెడ్‌లు అసోసియేట్ స్పాన్సర్లుగా వ్యవహరించనున్నారు.

Tata T1 Prima Truck Racing Championship Announced

ఈ రేస్ కోసం టాటా ప్రైమా 4038.ఎస్ ట్రక్కులను ఉపయోగించనున్నారు. ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 2100 ఆర్‌పిఎమ్ వద్ద 370 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ ప్రైమా ట్రక్కులను రేస్‌కు అనుగుణంగా ఉండేలా, ఇందులో 22 కీలక మోడిఫికేషన్లను చేశారు.

ఈ మోడిఫికేషన్లలో ఫ్యూయెల్ ట్యాంక్, బ్రేక్ కూలింగ్ సిస్టమ్, ప్రొపెల్లర్ షాఫ్ట్ గార్డ్స్, రేసింగ్ సీట్స్ అండ్ సేఫ్టీ బెల్ట్స్, ఎగ్జాస్ట్, స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి. టాటా మోటార్స్ ఈ ట్రక్కులను వివిధ దశల్లో క్వాలిటీ టెస్టింగ్ చేయటంతో పాటుగా, జెంషడ్‌పూర్‌లోని టెస్ట్ సర్క్యూట్‌పై హైస్పీడ్ రన్ మరియు కంట్రోల్ కోసం పలు పర్యాయాలు టెస్టింగ్ కూడా చేసింది.

More from DriveSpark

Article Published On: Thursday, January 23, 2014, 17:43 [IST]
English summary
Tata Motors, India's leading manufacturer of commercial vehicles, has officially confirmed announced the first edition of Tata T1 Prima Truck Racing Championship. Scheduled to kick start on March 23 at the Buddh International Circuit, this will be India's first tryst with truck racing.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+